విశాఖ

ఎక్సైజ్ ఎసి భాస్కర్‌కు 14రోజుల రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 20: ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టిన కేసులో అవినీతి నిరోధక శాఖాధికారులకు చిక్కిన ఎక్సైజ్ ఎసి లక్ష్మణ్‌భాస్కర్‌కు 14రోజుల రిమాండ్‌ను ఎసిబి స్పెషల్ కోర్టు విధించడంతో ఆయనను అడవివరంలోని సెంట్రల్ జైలుకు తరలించారు.
ఆదాయానికి మించిన ఆస్తులు సేకరించినట్టు ఎక్సైజ్ ఎసి భాస్కర్‌పై ఫిర్యాదులు అందడంతో ఎసిబి అధికారులు ఏక కాలంలో పదకొండు చోట్ల దాడులు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాలలో గల భాస్కర్ మూడు నివాసాలపై దాడులు జరిగిన సంగతి విదితమే. నివాసాలలో దొరికిన డాక్యుమెంట్లను సీజ్ చేయడంతో పాటు హైదరాబాద్‌లోని భాస్కర్ ఇంట్లో మూడు కిలోల బంగారం, పదిహేను కిలోల వెండి వస్తువులతో పాటు పెద్ద ఎత్తున నగదు దొరికిన విషయం విదితమే. భాస్కర్ పేరు మీద డాక్యుమెంట్లతో పాటు అతని భార్య, పిల్లల పేరుపై కూడ డాక్యుమెంట్లు ఎసిబి అధికారులకు చిక్కాయి. అంతే కాకుండా భాస్కర్‌కు సన్నిహితంగా ఉన్న మరో ఇద్దరి పేరుపై కూడ ఆస్తులున్నట్టు ఎసిబి అధికారులు గుర్తించి వారిద్దరిపై ట్రాన్సిన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మంగళవారం నాటికి మొత్తంగా బయట పడిన ఆస్తులు ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.ఐదు కోట్లు కాగా ఇందులోని 3.6కోట్ల ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నట్టు ఎసిబి డిఎస్‌పి కింజరాపు రామకృష్ణప్రసాద్ తెలిపారు.
రమారమి నేటికి రూ.నాలుగు కోట్ల మేరకు చేరుతుందన్నారు. ఇక్కడి కాపులుప్పాడలో భీనామి పేరుపై ఎకర భూమి ఉందని, ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.30లక్షలు కాగా, మార్కెట్‌లో దీని విలువ పది కోట్ల రూపాయల మేరకు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో పాటు జిల్లాలోని భాస్కర్‌తో సన్నిహితంగా ఉన్నవారి ఇళ్ళపై కూడా సోదాలు చేశామని, డాక్యుమెంట్లతో పాటు కొన్ని కవర్లు దొరికాయని, వాటిపై ఉన్న అడ్రాసులను బట్టి వారి గురించి కూడ వాకబు చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.