విశాఖ

నిర్లక్ష్యపు నీడలో ఆయుర్వేదిక్ వైద్యశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మనాభం, డిసెంబర్ 22 : మండలంలో రేవిడి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్యశాల పాలకలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇబ్బందుల్లో పడింది. ఇక్కడ వైద్యాధికారుల కొరత ఏర్పడింది. దీనిని పట్టించు కునే నాథేడే కరవయ్యాడు. దీంతో రోగులు పడరాని పాట్లు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వెద్యులు ఉండడం వల్ల రోగులు ఆసుపత్రి నుంచి వైద్యసేవలు పొందేవారు. సుమారు 4 సంవత్సరాల నుంచి వైద్యాధికారులు లేకపోవడంతో రోగుల సంఖ్య తగ్గిపోయింది. అలాగే విలువైన మందులు నిరుపయోగంగా ఉండడమే కాకుండా కాలపరిమితి దాటిపోతోంది. దీనికి సొంత భవనం లేకపోవడంతో రేవిడి పి.హెచ్.సి.లో ఉన్న శిథిలావస్థకు చేరుకున్న పాత భవనంలో నిర్వహిస్తున్నారు. ఇది కూలడానికి సిద్ధంగా ఉంది. గతంలో ఈ ఆసుపత్రికి ప్రతి రోజు సుమారు 50 మంది రోగులు వచ్చేవారు. ప్రస్తుతం వారు కానరావడం లేదు. వైద్యాధికారి లేకపోయినా అటెండరు మాత్రం రోజూ వచ్చి ఆసుపత్రిని తెరుస్తున్నారు. భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి అయినప్పటికీ ఈ ఆసుపత్రికి వైద్యుల కొరత తీరలేదు. ప్రభుత్వం మాత్రం వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని ప్రకటిస్తున్నా అటువంటి దాఖలాలు పద్మనాభంలో కానరావడం లేదు. సమాజంలో ఆయుర్వేద మందులకి విశేష ఆదరణ ఉంది. ఇప్పటికైనా మంత్రులు, జిల్లా అధికారులు స్పందించి ఆయుర్వేద శాలకి వైదాధికారిని నియమించాలని ప్రజలు, గ్రామస్థాయి నాయకులు కోరుతున్నారు.