విశాఖ

వణికిస్తున్న చలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 22: విశాఖను చలి వణికిస్తోంది. నగరవాసులు గజగజలాడుతున్నారు. ఎండలోకి వెళితే తప్ప చలి ఆగడంలేదు. సాయంత్రం అయ్యేసరికి ఇదికాస్త పెరిగి ఇబ్బందులు పెడుతోంది. దీంతో నగరంలోను, శివారుప్రాంతాల్లో పలుచోట్ల చలి మంటలు దర్శనమిస్తున్నాయి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు చలి కోట్లు, దుప్పట్లు ధరిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చలి, చలిగాలులతో అనేకమంది జలుబుతో బాధపడుతున్నారు. నగరంలో సాగరతీరంలోను, జూపార్కు నుంచి ఎండాడ, పిఎంపాలెం, మధురవాడ, బోయిపాలెం, కాపులుప్పాడ, సాగర్‌నగర్ తదితర ప్రాంతాల్లో చలి తీవ్రతతో వృద్ధులు, రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఆస్త్మా రోగులకు ఈ సీజన్ మరీ శిక్షగా మారింది. అర్ధరాత్రిళ్లు కాదు... పట్టపగలు సైతం ఉష్ణోగ్రతలు పడిపోతున్నందున నగరవాసులకు ఇబ్బందులు తప్పడంలేదు. అలాగే ఉదయం పది గంటల వరకు మంచు ప్రభావం ఉండటంతో సూర్యరశ్మి కోసం అవస్థలు పడుతున్నారు. చలి కారణంగా తెల్లారినా సమయం తెలియడంలేదు. విశాఖ ఏజెన్సీలో పరిస్థితి ఇక చెప్పకన్కర్లేదు. రెండు నుంచి ఐదు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీనివల్ల కేవలం మిట్టమధ్యాహ్నం మాత్రమే ఏజెన్సీ 11 మండలాల్లో గిరిజనులకు కాస్త వేడి లభిస్తుంది. ఆ తరువాత మళ్ళీ మామూలే. ఎక్కడికక్కడ చలి మంటలు వేసుకోవాల్సి వస్తోంది.