విశాఖపట్నం

హైస్కూల్స్‌లో ఆర్‌ఓ ఫ్లాంట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, డిసెంబర్ 12: విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీటిని అందించేందుకు అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఆర్‌ఓ ఫ్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శనివారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో 14 హైస్కూల్స్‌లో ఆర్‌ఓ ప్లాంట్‌లను ఏర్పాటు చేసామన్నారు. మిగిలిన హైస్కూల్స్‌లో కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీస్‌స్టేషన్‌లో ప్రారంభించిన ఆర్‌ఓ ప్లాంట్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు, పోలీసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పోలీస్‌స్టేషన్‌కు విశాలమైన గ్రౌండ్ ఉందని, ఈ స్థలంలో మొక్కలు పెంచి ఆహ్లాదకరంగా తయారు చేయాలన్నారు. శుద్ధి చేసిన తాగునీటిని ప్రజలకు అందించడం కోసం ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసామన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడంలో నర్సీపట్నం మున్సిపాలిటీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 20 లీటర్ల నీటిని కేవలం రెండు రూపాయలకు ఈ ప్లాంట్‌ల ద్వారా అందజేస్తున్నామన్నారు. నర్సీపట్నం ఎఎస్పీ సత్య ఏసుబాబు మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్ 100 పోలీస్ కుటుంబాలతో పాటు స్టేషన్‌కు వచ్చే ప్రజలకు తాగునీటి సమస్య తీరిందన్నారు. ఆర్‌ఓ ప్లాంట్‌కు నిధులు మంజూరు చేసిన మంత్రి అయ్యన్నపాత్రుడికి ఎఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. దీనిని సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, ఎంపిపి సుకల రమణమ్మ, మున్సిపల్ కమీషనర్ టి.రాజగోపాలరావు, పట్టణ సిఐ ఆర్.వి. ఆర్.కె.చౌదరి, పట్టణ ఎస్సైలు మల్లేశ్వరరావు, అప్పలనాయుడు, రూరల్ ఎస్సై విజయ్‌కుమార్ , పలువురు కౌన్సిలర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సమాచారం ఇవ్వకుండా మారుమూల గ్రామాలకు వెళ్ళకండి
* వ్యాపారులకు పోలీసులు కౌన్సిలింగ్
గూడెంకొత్తవీధి, డిసెంబర్ 12: సమాచారం ఇవ్వకుండా మారుమూల ప్రాంతాలకు వ్యాపారస్తులు వెళ్ళరాదని గూడెంకొత్తవీధి ఎస్సై నర్సింగమూర్తి తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో పోలీస్ స్టేషన్‌లో ఏజెన్సీ వ్యాపారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. చింతపల్లి నుండి 40 మంది గూడెంకొత్తవీధి మండలం 50 మంది వ్యాపారులకు ఎస్సై నర్సింగమూర్తి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు వెళ్ళే వ్యాపారులకు మావోయిస్టులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనిని పలుమార్లు వ్యాపారులకు తెలియజేసినప్పటికీ వారిలో మార్పు రాలేదని ఆయన అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మారుమూల ప్రాంతాలకు వెళ్ళే వ్యాపారులు మావోయిస్టులతో సంబంధాలు ఏర్పర్చుకుని వారి కావాల్సిన సామగ్రిని తీసుకు వెళ్తున్నారన్నారు. అపరాల సీజన్ ప్రస్తుతం మొదలవుతుందని, ఏ వ్యాపారి మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలన్నా పోలీస్‌స్టేషన్‌లో సంతకాలు చేసి వెళ్ళాలన్నారు. మరలా తిరిగి వచ్చేటప్పుడు పోలీసులను కలిసి వెళ్ళాలే తప్ప ఏమాత్రం సమాచారం ఇవ్వకుంటే చర్యలు తప్పవని ఆయన అన్నారు. మైదాన ప్రాంతాల నుండి వచ్చే వ్యాపారులు స్థానికంగా ఉండే వ్యాపారుల నుండి అపరాలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, వీరిలో ఎక్కువ శాతం మావోయిస్టులకు సామాగ్రి అందజేస్తున్నట్లు సమాచారం ఉందని వారిలో మార్పు రాకుంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.