విశాఖపట్నం

ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 22: సంక్రాంతి సెలవుల్లోను హాస్టల్ వసతి కల్పించాలని కోరుతూ ఎయు విద్యార్థులు గురువారం రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో తామంతా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నామని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ సెలవుల్లో కూడా వసతి సౌకర్యం కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఎయుకి ఈ నెల 23 నుంచి వచ్చేనెల 20 వరకు అంటే దాదాపు నెల రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. దీంతో ఈనెల రోజుల పాటు హాస్టల్‌ను మూసివేయనున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గ్రూపు-2, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో అధిక సంఖ్యలో విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఎయుకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో తామంతా ఊళ్లకు వెళ్లి అక్కడ చదువుకునే పరిస్థితులు లేవన్నారు. హాస్టల్లోనే ఉండి, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులంతా తమకు హాస్టల్ వసతి కల్పించాలన్నారు. లైబ్రరీ సమయాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు బయటికి వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. అదే సమయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి విద్యార్థులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పరిస్థితులు చక్కబెట్టేందుకు, విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు ఎయూ రిజిస్ట్రార్ ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు ప్రయత్నించారు. హాస్టల్లో ఎంత మంది విద్యార్థులు ఉండాలనుకుంటున్నారని, ఎంతమందికి వసతి కల్పించాలని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వీరందరికీ భోజన వసతి కల్పించే అంశంపై వివరాలు తెలియజేయాల్సిందిగా సూచించారు. అయితే దీనికి సంతృప్తి చెందని విద్యార్థులు నినాదాలు చేస్తూ ఎయు విసి ఆచార్య నాగేశ్వరరావు తమ వద్దకు వచ్చి తగిన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు.