విశాఖ

విజిలెన్స్ తనిఖీలపై వాడివేడి చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, డిసెంబర్ 25 : గతంలో ఆనేకసార్లు దేవస్థానంలో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించినప్పటికీ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదనే చెప్పాలి. ఈసారి తనిఖీలు క్షేత్రస్థాయిలో జరగడం, అధికారులు రాత్రి వరకు దేవస్థానంలో ఉండడంతో ఉద్యోగుల్లో పలురకాల ఊహగానాలకు తావిచ్చినట్లయింది. సాధారణ తనిఖీలేనని విజిలెన్స్ అధికారులు చెబుతున్నప్పటికీ పక్కా సమాచారంతోనే తనిఖీలు నిర్వహించారన్న ప్రచారం జరుగుతోంది. విజిలెన్స్‌లో అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొనడం కూడా అనుమానాలకు బలమిస్తోంది. దేవస్థానం వద్ద వివరాలు సేకరించి వెళ్ళిన విజిలెన్స్ అధికారులు క్షేత్ర స్థాయిలో వాటిని పరిశీలన చేస్తున్నారు. ప్రధానంగా అన్నదానం, ప్రసాదాల నాణ్యత, సరకుల కొనుగోలు, ఇంజినీరింగ్ పనులకు సంబంధించి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు ప్రచారం జరుగుతోంది. వీటికి సంబంధించి లోటుపాట్లు కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారం పై సమగ్రమైన నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపేందుకు విజిలెన్స్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.