విశాఖపట్నం

శాస్ర్తియ దృక్పథాన్ని యువతలో పెంపొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 26: యువతలో శాస్ర్తియ దృక్పథాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఏయూ సిస్టమ్స్ డిజైన్ విభాగంలో నిర్వహించిన విజ్ఞాన జ్యోతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తిరుపతిలో నిర్వహిస్తున్న 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ రాష్ట్రానికి, దేశానికి ఎంతో ప్రతిష్టాత్మకమైందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువతలో సైన్స్‌పట్ల ఉత్సుకత, అవగాహన కల్పించే దిశగా కార్యక్రమం చేపట్టడం మంచి పరిమణామన్నారు. జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో దేశంలోని ప్రముఖ శాస్తవ్రేత్తలు, నోబెల్ బహుమతి గ్రహాతలు హాజరై విశిష్ట ప్రసంగాలను అందించడం జరుగుతుందన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ఏయూ యాసిక్ విభాగం నుంచి ఏయూ అవుట్‌గేట్ వరకు విజ్ఞాన జ్యోతిని పట్టుకుని ర్యాలీ నిర్వహించారు.

2న విశాఖకు పవన్
* 3న ఉద్దానంలో కిడ్నీ బాధితులకు పరామర్శ

విశాఖపట్నం, డిసెంబర్ 26: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ జనవరి 2,3 తేదీల్లో ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 2న సాయంత్రం విశాఖ చేరుకునే పవన్ కల్యాణ్ రాత్రికి ఇక్కడే బసచేస్తారు. మరుసటి రోజు ఉదయం రోడ్డు మార్గం గుం డా బయలుదేరి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం చేరుకుంటారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులను పవన్ కల్యాణ్ పరామర్శిస్తారు. ఒకే ఊరిలో పదుల సంఖ్యలో కిడ్నీ రోగులు ఉండటం, వారికి ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం అందకపోవడంపై పవన్ ఆరా తీయనున్నారు. బాధితులకు న్యాయం జరిగేందుకు ఎటువంటి కార్యాచరణ చేపట్టాలన్న అంశంపై చర్చిస్తారు. పవన్ కల్యాణ్ పర్యటన గత నెలలోనే జరగాల్సి ఉన్నప్పటికీ, నోట్ల రద్దు, తదితర అంశాలతో వాయిదా పడింది. తాజాగా పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనపై ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.