విశాఖపట్నం

నృసింహవనాన్ని పరిశీలించిన దుర్గగుడి ఈవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, డిసెంబర్ 27 :సింహాచలేశుని దేవస్థానం కృష్ణాపురం వద్ద వంద ఎకరాలలో ఏర్పాటు చేసిన నృసింహవనం, గోశాలను విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి సూర్యకుమారి ( ఐ ఎ ఎస్ ) మంగళవారం సందర్శించారు. వనంలో దేవస్థానం సాగుచేస్తున్న పూలు, కాయకూరలను ఆమె పరిశీలించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ పనులను చూసారు. ప్రధానంగా నర్సరీని చూసి ఆమె ఆనందం వ్యక్తం చేసారు. వనం నిర్వహణ విషయాన్ని అక్కడున్నవారిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాలలో నర్సరీలను ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ ఆదేశించిన నేపథ్యంలో సింహాచలం దేవస్థానం ఇప్పటికే నృసింహవనంలో అనేక రకాల మ్కొలు నాటి యుద్ధప్రాతిపదికన సాగుచేస్తున్న విషయాన్ని ఉన్నతాధికారుల ద్వారా తెలుసుకున్న దుర్గగుడి ఈవో స్వయంగా వచ్చి వనాన్ని పరిశీలించారు. అంతకు ముందు ఆమె సింహగిరి పై దేవస్థానం ఈవో రామచంద్రమోహన్‌ని కలిసి మాట్లాడారు. దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. గతానికి ఇప్పటికి సింహగిరి పై వచ్చిన మార్పుల పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసారు.
* సింహాచలేశుని సేవలో..
విజయవాడ కనకదుర్గ దేవాలయ కార్యనిర్వహణాధికారి సూర్యకుమారి ( ఐ ఎ ఎస్ ) పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మంగేశ్వర్ సాహు కుటుంబ సమేతంగా వచ్చి సింహాద్రినాథున్ని దర్శించుకున్నారు. దేవాలయ అధికారులు వీరికి స్వాగతం పలికారు. కప్పస్తంభం అలింగనం చేసుకున్న ప్రముఖులు స్వామివారిని ప్రార్థించుకున్నారు. అంతరాలయంలో వీరి పేరున అర్చకులు సంప్రదాయ పూజలు చేసి ఆశీర్వదించారు.

దేవస్థానం హుండీ
ఆదాయం రూ. 51.96 లక్షలు
సింహాచలం, డిసెంబర్ 27 :శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయ హుండీల ఆదాయం లెక్కింపు మంగళవారం జరిగింది. 13 రోజులకు గాను ఏభై ఒక లక్ష తొంభై ఆరువేల ఏడువందల ఎనభై మూడు రూపాయల నగదు, 25 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారం, 3 కిలోల 350 గ్రాముల వెండి భక్తులు కానుకల రూపంలో సింహాచలేశునికి సమర్పించారు. ఇందులో 3 లక్షల 10 వేల రూపాయల విలువచేసే 155 రెండువేల రూపాయల నోట్లు, 2లక్షలు విలువ చేసే 200 వెయ్యి నోట్లు, 2లక్షల 38 వేలు విలువ చేసే 476 పాత అయిదు వందలు, 65 వేలు విలవ చేసే కొత్త అయిదు వందల రూపాయల నోట్లు భక్తులు సమర్పించిన నగదులో ఉన్నాయి. 20లక్షల 38 వేల 800 రూపాయలు విలువ చేసే 20వేల 388 వంద రూపాయల నోట్లు, 5లక్షల 22వేల 950 రూపాయల విలువ చేసే 10,459 ఏభై రూపాయలు, 3లక్షల 95 వేల 360 రూపాయల విలువ చేసే 19,768 ఇరవై రూపాయల నోట్లు, 10 లక్షల 85 వేల 90 రూపాయల విలువ చేసే ఒక లక్ష ఎనిమిది వేల అయిదు వందల తొమ్మిది పది రూపాయల నోట్లుతో పాటు అయిదు, రెండు, ఒక రూపాయి నోట్లు 7,440 రూపాయలు, 3లక్షల 34 వేల నాలుగు వందల ఇరవై మూడు రూపాయల విలువ చేసే నాణేలు ఈ ఆదాయంలో ఉన్నాయి. దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ పర్యవేక్షణలో ఉద్యోగులు, శ్రీహరి సేవా ప్రతినిధులు ఆదాయం లెక్కింపులో పాల్గొన్నారు. లెక్కించిన ఆదాయాన్ని బ్యాంకు అధికారులకు అప్పగించి డిపాజిట్ చేసారు.