విశాఖ

మంత్రి గంటా ఆస్తులు స్వాధీనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 29: ఇండియన్ బ్యాంక్ నుంచి సుమారు 150 కోట్ల రూపాయల రుణం తీసుకున్న ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి హామీగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన వివిధ ఆస్తులను గురువారం ఆ బ్యాంక్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నేరుగా మంత్రి ఈ బ్యాంక్ నుంచి రుణం తీసుకోనప్పటికీ పై కంపెనీకి హామీగా వ్యవహరించడం, ఇప్పటికే ఆ కంపెనీ డైరెక్టర్లకు డిమాండ్ నోటీసులు బ్యాంక్ ఇచ్చినా స్పందించక పోవడంతో ఈ ఆస్తుల స్వాధీనం అనివార్యమైనట్లుగా తెలుస్తోంది.
* స్వాధీనమైన మంత్రి ఆస్తులు ఇవే..
బాలయ్యశాస్ర్తీ లే అవుట్ పరిధిలోని సర్వే నెంబర్ 20 పిలో ప్లాటు నెంబర్ ఏ 12లో 444 చదరపు విస్తీర్ణంలోని అవిభాజ్యపు భూమి, త్రివేణీ టవర్స్‌లో 11వ నెంబర్ ఫ్లాట్, అక్కడి నిర్మాణపు ఆస్తి, విశాఖ సమీపానున్న కూర్మన్నపాలెంలో సర్వే నెంబర్ 13-20, 113-21, 113-22ల్లో 144 చదరపు గజాల విస్తీర్ణం గల భూమి, అనకాపల్లి జాతీయ రహదారి సమీపంలోని పూడిమడక జంక్షన్ వద్ద ఉన్న సర్వే నెంబర్లు 787-3, 788-3, 788-4, 788-6లో గల భూమి, చోడవరం మం డలం కొత్తవూరు మెయిన్‌రోడ్డులో డోర్‌నెంబర్ 7-3-6 దగ్గ వార్డు నెంబర్ ఏడులో 1,355 చదరపుగజాల విస్తీర్ణంలో ఉన్న భూమి, ఇందులో నిర్మించిన ఆస్తిని బ్యాం కు అధికారులు స్వాధీనపర్చుకున్నారు. అలాగే విశాఖ ఎంవీపి కాలనీలో పి.రాజారావు, మంత్రి పేర్లతో ఉన్న పెదవాల్తేరు సర్వేనెంబర్ 10హెచ్‌ఐజి ఫ్లాటు, 231-4లో నివాస భవనం, ఆస్తి స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నట్టు తెలిసింది. వీటితోపాటు ఆనందపురం మం డలం వేములవలస గ్రామం సర్వేనెంబర్ 122-11లో గల 726 చదరపుగజాల భూమి, ఇదే మండలం సర్వేనెంబర్ 122-8,9, 10,11,12,13, 14,15ల్లో ఉన్న 4.33 ఎకరాల ఆస్తి, సర్వే నెంబర్ 124-1, 2,3,4,5ల్లో కలిగి ఉండే మరో 0.271-2 ఎకరాల భూమి ఆస్తులను బ్యాంకు అధికారులుస్వాధీనపర్చుకున్నారు. ప్రత్యూష రీసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో పి.రాజారావు, పి.వెంకయ్య ప్రభాకరరావు, పి.వెంకట భాస్కరరావు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే మంత్రి గంటా, కొండయ్య బాల సుబ్రహ్మణ్యం, నార్ని అమూల్య ఇండియన్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి హామీదారులుగా ఉన్నారు. డాబాగార్డెన్స్ శారదావీధిలో ఉన్న ఇండియన్ బ్యాంకు నుంచి కంపెనీ రుణాన్ని తీసుకుంది. ఈ విధంగా తీసుకున్న రుణం 150 కోట్లు కాగా ఇప్పటి వరకు వడ్డీతో సహా దాదాపు 200 కోట్లకు చేరిందని బ్యాంక్ అధికారులు వెల్లడించినట్లు తెలిసింది. గడువు ముగిసినా రుణ బకాయి చెల్లింపు జరగక అక్టోబర్ 4న ఈ మేరకు సదరు కంపెనీకి నోటీసు జారీ చేసింది. అయినప్పటికీ కంపెనీగానీ, సంస్థ డైరెక్టర్లుగానీ, హామీదారులుగానీ స్పందించకపోవడంతో ఈ ఆస్తుల స్వాధీనం జరిగినట్లు తెలుస్తోంది.