విశాఖ

రూ. 1.19 కోట్లు బొక్కేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, డిసెంబర్ 30: 2015 జూలై నుండి 16 ఆగస్టు వరకు మండలంలో జరిగిన ఉపాధి పనుల్లో కోటి 19 లక్షల మేర అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీల సర్వేలో గుర్తించారు. 15 జూలై 1 నుంచి 2016 ఆగస్టు 30 వరకు మండలంలో జరిగిన 14.61 కోట్ల పనుల్లో ఈ నెల 8 నుండి 26 వరకు సామాజిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం శుక్రవారం మండల కేంద్రంలో సామాజిక తనిఖీల ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు ఎ.పి.డి. లచ్చన్న మాట్లాడుతూ అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. పథకంలో జరిగిన పనుల్లో పలు లోపాలను గుర్తించామని, వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి బాధ్యులపై తగు క్రమశిక్షణా చర్యలు చేపడతామన్నారు. అధికమొత్తంలో అవినీతికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని ఎ.పి. ఓ. కొండబాబును ఆదేశించారు. ఈ తనిఖీల్లో చనిపోయి న వారి పేరున మస్టర్లు, ఉద్యోగుల పేరిట పనులు నిర్వహించినట్లు గుర్తించిన డి.ఆర్.పి.లు ప్రజావేదికలో వివరించారు. మండలంలోని 33 పంచాయతీల్లో జరిగిన 14 కోట్ల పనుల్లో జరిగిన కోటి 20 లక్షల అవినీతిలో అత్యధికంగా బూదరాళ్ళ పంచాయతీలో 24 లక్షల మేర ఆవినీతి జరిగినట్లు గుర్తించగా అతి తక్కువగా మఠంభీమవరం పంచాయతీలో 8వేలు మాత్రమే అవకతవకలు జరిగినట్లు వెల్లడైందన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు లేకపోగా సామాజిక తనిఖీల ప్రయోజనం ఏమిటని గిరిజన సమాఖ్య జిల్లా నేత జి.చిన్నారావు అధికారులను ప్రశ్నించగా ఇకపై అటువంటి లేకుండా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎ.పి.డి. ఆనందరావు, చింతపల్లి ఎ.పి.డి. రవీంద్ర, ఎం.పి.పి. జి.సత్యనారాయణ, జెడ్పిటిసి గాడి శ్రీరామ్మూర్తి, ఎం.పి.డి. ఓ. సంతోషం తదితరులు పాల్గొన్నారు.