విశాఖపట్నం

విమ్స్‌లో అందుబాటులోకి మరిన్ని వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 31: కొత్త సంవత్సరంలో విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (విమ్స్)లో మరిన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు డైరెక్టర్ డాక్టర్ సివి రావు తెలిపారు. విమ్స్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఔట్ పేషెంట్లకు ప్రస్తుతం అందజేస్తున్న సేవలకు అదనంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్టోఎంట్రాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ తదితర 12 వైద్య సేవలను అదనంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎన్‌టిఆర్ వైద్య సేవల కింద జనిటో యూరినరీ సర్జరీ, క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందించనున్నట్టు తెలిపారు. డెలివరీ, మెటర్నటీ వైద్య సేవలు కూడా త్వరలో అందుబాటుకి వస్తాయన్నారు. పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన లేబొరేటరీ, రేడియోలజీ సౌకర్యాలు ఇప్పటికే ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే సి.టి స్కాన్, బ్లడ్ స్టోరేజ్, డయాలసిస్ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. వీరితో పాటు అదనంగా మరికొంతమంది వైద్య నిపుణులు, సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆసుపత్రిలో 500 పడకల సామర్ధ్యంతో నిర్మించినప్పటికీ ప్రస్తుతం 100 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, భవిష్యత్‌లో పూర్తి సామర్ధ్యంతో తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. విమ్స్‌కు ప్రత్యేక గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయడం వల్ల ఇప్పటికే అటానమస్ ఇనిస్టిట్యూట్‌గా విమ్స్ రూపుదిద్దుకుందని, దీన్ని మరింత పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తి గల సంస్థగా దశల వారీగా తీర్చిదిద్దుతామన్నారు. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన విమ్స్‌ను నిమ్స్, సిమ్స్ తరహాలో అభివృద్ధి పరుస్తామని తెలిపారు. సమావేశంలో పలు విభాగాల వైద్య నిపుణులు పాల్గొన్నారు.

రేపటి నుంచి జన్మభూమి
11 వరకు నిర్వహణ
925 పంచాయతీలు, 164 వార్డుల్లో గ్రామసభలు
50, 900 రేషన్ కార్డుల జారీకి నిర్ణయం
నియోజకవర్గానికి కొత్తగా 2000 పింఛన్లు
జిల్లా ప్రత్యేకాధికారిగా విజయానంద్ నియామకం

విశాఖపట్నం, డిసెంబర్ 31: జిల్లాలో కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు ప్రభుత్వం సీనియర్ ఐఎఎస్ అధికారి కె విజయానంద్‌ను ప్రత్యేకాధికారిగా నియమించింది. జిల్లాలో 925 పంచాయతీలు, 164 మున్సిపల్ వార్డుల్లో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జివిఎంసి జోన్, మున్సిపల్, మండలాలకు మూడేసి బృందాలను నియమించారు. జిల్లాలో 150కి పైగా బృందాలను జన్మభూమి కార్యక్రమానికి సిద్ధం చేశారు. జోనల్, మున్సిపల్ కమిషనర్లు, మండల అభివృద్ధి అధికారులు, తహశీల్దారుల సారధ్యంలో ఏర్పాటు చేసిన ఈ బృందాలు రోజు కు కనీసం రెండు పంచాయతీలు, వార్డుల్లో గ్రామ సభలను నిర్వహించాల్సి ఉం టుంది. గత మూడు విడతలుగా నిర్వహించిన జన్మభూమి-మావూరు కార్యక్రమంలో అందిన వినతుల ఆధారంగా కొత్తగా జిల్లాలో 50,900 రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. అలాగే నియోజకవర్గానికి 2000 సామాజిక పిం ఛన్లు మంజూరు చేయనున్నారు. అర్బన్ పరిధిలో 36,730 మందికి, రూరల్‌లో 14,164 మందికి రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. అలాగే అర్హులు, బడుగు, బలహీన వర్గాలకు ఆస్తులు, చంద్రన్న బీమా క్లైములు మంజూరు చేయనున్నారు. డ్వాక్రా రుణమాఫీలో భాగంగా పొదుపు సంఘాల్లోని మహిళల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో రూ.3000 నగదు జమ చేయనున్నారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 47 వేల మహిళా సంఘాలకు రూ.211 కోట్లు మంజూరు చేశారు. ఈ సారి జన్మభూమి కార్యక్రమంలో కుటుంబ, సమాజ వికాసానికి ప్రాధాన్యతనిస్తూ ఆకర్షణీయ గ్రామాలు,వార్డుల రూపకల్పన లక్ష్యంగా ప్రజలను చైతన్య పరచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిం ది. కుటుంబ వికాసానికి 10 అంశా లు, సమాజ వికాసానికి 15 అంశాలపై జన్మభూమి సభల్లో అధికారులు ప్రజలకు వివరిస్తారు. నగదు రహిత లావాదేవీలను పూర్తిస్థాయిలో ప్రోత్సహించేందుకు డిజిటల్ అక్షరాస్యతపై ప్రజలను అవగాహన కల్పిస్తారు.