విశాఖ

వ్యాపారం చేయని నేతలెవరున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, డిసెంబర్ 31: ప్రస్తుతం ఎటువంటి వ్యాపారాలు లేని రాజకీయ నేతలెవరున్నారని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రతిపక్ష వైసిపి నేతలను ప్రశ్నించారు. బ్యాంకులకు రుణం ఎగ్గొట్టారనే అభియోగంపై ఆస్తుల వేలాన్ని సంబంధిత బ్యాంకులు ప్రకటించిన జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని వైసిపి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ చేసిన డిమాండ్‌పై ఆయనపై విధంగా స్పందించారు. శనివారం స్థానిక విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ ఆరేళ్ల క్రితం మంత్రి పదవి చేపట్టాక ప్రత్యూ ష కంపెనీలో డెరెక్టర్ పదవికి గంటా శ్రీనివాసరావు ఆనాడే రాజీనామా చేశారన్నారు. అయితే ప్రత్యూష సంస్థలు వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణానికి హామీగా ఉన్నారనే అభియోగంపైనే బ్యాంకులు మంత్రి గంటాకు చెందిన ఆస్తులపై బహిరంగ వేలాన్ని ప్రకటించాయన్నారు. రెండు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన గంటా మంత్రిగా అవినీతికి పాల్పడి ఉంటే బ్యాంకులకు సంబంధిత రుణాన్ని ఏనాడో చెల్లించి ఉండే వారన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న నేతలంతా ఏదో ఒక వ్యాపారాలు చేస్తున్నవారేనని వారు పేర్కొన్నారు. వైసిపి అధినేత జగన్‌మోహన రెడ్డి ప్రజాధనాన్ని దొడ్డిదారిన కొల్లగొట్టి జైలుపాలయ్యారని అటువంటి నేతకు చెందిన పార్టీకి చెందిన వైసిపి నేతలు మంత్రి గంటా రాజీనామా కోరడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. సమావేశంలో పాల్గొన్న పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బుద్ద నాగజగదీష్ మాట్లాడుతూ తన తండ్రి వైఎస్ అధికారంలో ఉండగా అక్రమంగా సంపాదించిన ఆస్తులతో కోర్టు కేసులను, జైలుశిక్షను అనుభవించిన వైఎస్ జగన్ అనుచరులైన ఆ పార్టీ నేతలు మంత్రి గంటాతోపాటు టిడిపికి చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరి ఇతరత్రా నేతలపై విమర్శలు గుప్పించడం తగదన్నారు. పట్టణ తెలుగుయువత అధ్యక్షుడు మళ్ల సురేంద్ర మాట్లాడుతూ రెండు దశాబ్దాల రాజకీయ చరిత్రలో గంటా నీతినిజాయితీలతో రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో ఉండి స్వార్ధం కోసం వైసిపిలో చేరిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్‌కు దేశం నేతలను విమర్సించే అర్హత లేదని ఖండించారు. ఎంపీ సోదరుడు మహేష్, కశింకోట మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు ఉగ్గిన రమణమూర్తి, జిల్లా టిఎన్‌టియుసి నాయకులు గుత్తా ప్రభాకర చౌదరి, మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ పలకా సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.