విశాఖ

ఢోకా ఉండదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం(టౌన్), జనవరి 1: పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018 నాటికి ఖరీఫ్ సాగుకు వీలుగా నీటిని అందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016లో మూడు ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి చేతుల మీదుగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అవార్డును అందుకోవడం, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యంకావడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి ఫలితంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఏర్పడిందన్నారు. ఈ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కలలు నెరవేరుతాయన్నారు. విశాఖ జిల్లాలో లక్షా 50 వేల ఎకరాలకు, తూర్పుగోదావరి జిల్లాలో 2.50 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2.58 లక్షలు, కృష్ణాజిల్లాలో 62 వేల ఎకరాలకు అదనంగా సాగునీరు లభిస్తుందన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో మూడు పంటలు పండించవచ్చన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా విశాఖ అభివృద్ధి వేగం మరింత పుంజుకుంటుందన్నారు. 28 టి.ఎం. సి.ల నీటితో విశాఖలో తాగునీటితో పాటు పరిశ్రమలకు అవసరమైన జలాలను అందిస్తారన్నారు. ఈ ఏడాది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 1,055 పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపడుతున్నామన్నారు. వీటిలో 30 శాతం పోస్టులను మహిళలకు కేటాయించామన్నారు. యూనివర్శిటీల్లో గుర్తింపు పొందిన డిగ్రీ కలిగిన వారు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఏప్రిల్‌లో ప్రిలీమ్‌నరీ, జూలైలో మెయిన్ పరీక్షలు ఆన్‌లైన్‌లో ఉంటాయన్నారు. పంచాయతీ రాజ్ ఇంజనీర్ల నియామకం చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో 15 వేల మేజర్ పంచాయతీల్లో ఎల్‌ఇడి దీపాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉపాధి హామీ పనులు అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం, పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు, మరుగుదొడ్లు, పంట కుంటల నిర్మాణం, వర్మీ కంపోస్టులు ఏర్పాటు, శ్మశానాల ఆధునీకరణ తదితర అభివృద్ధి పనులను అమలు చేయడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ముందంజలో ఉందని పేర్కొన్నారు. గ్రామాల్లో 80 శాతం రోడ్లను సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చేయడం తనకు సంతృప్తిని కలిగించిందన్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో కేవలం 1,300 కిలో మీటర్లు సి.సి.రోడ్లు వేయగా, మన రాష్ట్రంలో 4,500 కిలో మీటర్లు సి.సి. రోడ్లు నిర్మించామన్నారు. ఈ ఏడాది మరో ఐదువేల కిలో మీటర్ల రోడ్లకు గాను ఇప్పటికే 3,400 కిలో మీటర్ల రోడ్లు పూర్తయ్యాయన్నారు. ప్రస్తుతం 2,500 గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణం పూర్తయిందని, మార్చినెలాఖరు నాటికి మరో 2,500 భవనాలు పూర్తి చేస్తామన్నారు. 7,500 అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ఉపాధి నిధుల నుండి ఒక్కొక్క భవనానికి ఐదు లక్షల వంతున మంజూరు చేసామన్నారు. శ్మశానాల అభివృద్ధికి 10 లక్షలు వంతున 1,500 మరుభూములను అభివృద్ధి చేసినట్లు వివరించారు. ఉపాధి హామీ పథకం చెల్లింపుల్లో 88.88 శాతం చెల్లింపులు చేసి దేశంలోనే ఫ్రథమస్థానం సాధించిందన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల 35,769 మరుగుదొడ్లు నిర్మించామని, 30 లక్షల 77వేల పంట కుంటలను పూర్తి చేసామని, 13వేల పంచాయతీల్లో లక్షా 7వేల 119 వర్మీకంపోస్టులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కొత్త సంవత్సరంలో 260 కోట్ల సబ్‌ఫ్లాన్ నిధులతో ఎస్సీ కాలనీల్లో 2,247 కిలో మీటర్లు సిమెంట్లు రోడ్లు వేయనున్నట్లు మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు.