విశాఖపట్నం

సింహగిరిపై వైభవంగా కొత్త సంవత్సరం వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జనవరి 1 : కృతయుగ దైవం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారు కొలువె వున్న సింహగిరిపై 2017 కొత్తసంవత్సర వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొని ఆనందోత్సాహాల నడుమ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన రాజకీయ, అధికార ప్రముఖులు వరాహ నారసింహుడ్ని దర్శించుకున్నారు. ఈవో రామచంద్రమోహన్ వీరికి అర్చక పరివారంతోకలిసి స్వాగతం పలికారు. కప్పస్తంభాన్ని అలింగనం చేసుకున్న ప్రముఖులు స్వామి వారిని ప్రార్థించుకున్నారు. అంతరాలయంలో ప్రముఖుల పేరిట అర్చకులు అషోత్తర శతనామార్చన చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణలు, నాదస్వర వాయిద్యాల నడుమ ప్రముఖులను ఆశీర్వదించారు. అధికారులు వీరికి ప్రసాదాలను అందజేశారు. సింహాద్రి నాథుడిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, భీమిలి మాజీ శాసన సభుడు కర్రి సీతారామ్, జిల్లా జడ్జి శ్రీమతి పి.వి. జ్యోతిర్మయి, ఇపిఎఫ్ కమిషనర్ పి. ఇందిరా దంపతులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని సుందరంగా అలంకరించారు. రాజగోపురం ముందు రంగవల్లులు వేయించారు. ఎసిపి భీమారావు, సిఐ వైకుంఠరావు, దేవస్థానం ఉద్యోగుల సంఘం, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు దేవాలయానికి వచ్చి ఈవోకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ప్రసాదాలు స్వీకరించారు.