విశాఖ

4.60 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాతవరం, జనవరి 2: రాష్ట్రంలో 4.60 లక్షల కొత్త రేషన్ కార్డులను జన్మభూమి సభల్లో అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. మండలంలోని మర్రిపాలెంలో సోమవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జన్మభూమి ద్వారా నిజమైన లబ్ధిదారులకు పార్టీల కతీతంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. రాష్ట్రంలో నూతనంగా 3.50 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. 24 గంటల కరెంట్‌ను అందిస్తున్నామన్నారు. సోలార్ ద్వారా అందిస్తున్న విద్యుత్‌ను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత ఏడాది ఐదు లక్షల మందికి ఎన్టీఆర్ గృహ కల్ప పథకానికి ఏర్పాటు చేశామని, ఏడాది 10 లక్షల మంది ఇళ్ళను మంజూరు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో 13వేల పంచాయతీల్లో 200 కోట్ల నిధులతో సి.సి. రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. రైతు రుణమాఫీ కింద ఇప్పటికే 24 వేల కోట్లు ఆయా బ్యాంకుల్లో జమ చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది చంద్రన్న కానుకల్లో భాగంగా రాష్ట్రంలో 9.80 కోట్ల నిధులతో ప్రతీ ఇంటికి వౌలిక సరుకులు అందిస్తామన్నారు. చంద్రన్న బీమాను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జన్మభూమి ప్రత్యేకాధికారి డిఎఫ్‌ఒ శేఖర్‌బాబు, డిఎల్‌పిఒ, డిఆర్‌డిఎ పిడి, ఆర్డీవో, మండల స్థాయి అధికారులతో పాటు దేశం పార్టీ నాయకులు రమణ, ఎం.పి.పి. చిటికెల సన్యాసిదేముళ్ళు, జెడ్‌పిటిసి సత్యనారాయణ, చైర్మన్లు కొండబాబు, అబ్బారావు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.