విశాఖ

అక్షరాస్యులుగా ఉంటేనే ‘ఆదర్శం’కు సార్థకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, జనవరి 2: గ్రామంలోని ప్రతీ ఒక్కరూ అక్షరాస్యులుగా ఉన్నప్పుడే ఆదర్శగ్రామానికి సార్థకతని ఎంపి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఎంపి దత్తత గ్రామమైన దుడ్డుపాలెంలో సోమవారం జన్మభూమి-మా ఊరు గ్రామసభ ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపి మాట్లాడారు. ఇప్పటికే 3.70కోట్ల రూపాయలు గ్రామంలో అభివృద్ధి పనుల కోసం వ్యయం చేశామని తెలిపారు. ఆధునిక విద్యుద్ధీపాల అలంకరణ, సిసి రోడ్లు, చెరువుల అభివృద్ధి వంటి పనులు చేపట్టామన్నారు. అవసరమయితే మరిన్ని నిధులు గ్రామానికి మంజూరు చేస్తామన్నారు. అయితే, ముందుగా గ్రామంతోపాటు ప్రజలు ఆదర్శంగా ఉండాలని, ప్రతీ ఒక్కరూ అక్షరాస్యులు కావడం, వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకోవడం, ప్రతీ ఇంటి ఆవరణలో చెట్లు నాటడం వంటి పనులు చేపట్టాలని కోరారు. గ్రామంలో అర్హులైన వారందరికీ పింఛన్‌లు, గృహాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు జరిగేలా ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు, అధికారులు దృష్టిసారించాలన్నారు. అంతకుముందు గ్రామస్తులు పాకలపాడు రామనారాయణరాజు, అప్పలనర్సమ్మ తదితరులు పాపయ్యసంతపాలెం స్థలంలో అనకాపల్లి వాసులు ఆక్రమణలు జరిపారని, ఈ రెవెన్యూ బోర్డర్‌ను నిర్ధారించి తమ గ్రామంలోని నిరుపేదలకు భూ పంపిణీ చేయాలని కోరారు. చెరువుల్లో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటుచేస్తే సుమారు 1,500 ఎకరాలకు సాగునీరు లభిస్తుందన్నారు. గతంలో నిర్మించుకున్న గృహాలకు గృహనిర్మాణ పథకం కింద చెల్లింపులు జరపాలని ఎంపీకి సమస్యలను ఏకరవుపెట్టారు. సమస్యలన్నింటిని రెవెన్యూ అధికారులు, ఆర్డీవో, ఎమ్మెల్యేల పరిష్కరిస్తారని తెలిపారు. ఆర్డీవో పద్మావతి, సిఇవో జయప్రకాష్ నారయణ, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరావు, జెడ్‌పిటిసి మత్స్యరాజు, ఎంపిపి కొండతల్లి సత్యనారాయణ, సర్పంచ్ జి.వరలక్ష్మి సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.