విశాఖపట్నం

అర్హులందరికీ సంక్షేమపథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 3: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కరికి అన్యాయం జరుగకుండా అర్హులందరికీ చేరే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తెలిపారు. మంగళవారం జన్మభూమి- మా ఊరులో భాగంగా జోన్-2 పరిధిలో గల సీతమ్మధార నెహ్రుమున్సిపల్ హైస్కూల్‌లో 13, 14 వార్డులకు జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వపరంగా లభించే పథకాలకు సంబంధించి సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానన్నారు. అన్ని వార్డుల్లోను పించన్లకు అర్హత ఉండి రానివారు ఎవరైనా ఉంటే వారికి పించన్లు మంజూరు చేయిస్తామన్నారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొనే వారికి ఆరోగ్యపరమైన సమస్య ఉండి, ఎన్‌టిఆర్ వైద్య సేవ పథకంలో కవరు కాకుండా ఉంటే అటువంటి వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుని సంబంధిత బిల్లులను తమ కార్యాలయానికి అందజేస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సగం వచ్చే విధంగా మంజూరుకు సిఫారసు చేయడం జరుతుందన్నారు. ప్రభుత్వ భూమిలో నివశిస్తూ పట్టాలు లేని వారందరికి క్రమబద్ధీకరణలో భాగంగా మన ముఖ్యమంత్రి గత నెలలో ఇళ్ళ పట్టాలను మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఉత్తర నిజకవవర్గానికి సంబంధించి ఆరువేల మందికి ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయకుండా మిగిలి ఉంటే ఆన్‌లైన్‌లో ఇళ్ళ పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జివిఎంసి అదనపు కమిషనర్ జివిఎస్‌ఎస్ మూర్తి, జోనల్ కమిషనర్ నల్లనయ్య, జన్మభూమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సింహాఛలం భూసమస్యపై జన్మభూమిలో రగడ

వేపగుంట, జనవరి 3: స్థానిక వేపగుంట జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో మంగళవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం భూ సమస్యపై ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తికి, సిపిఎం నాయకులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తొలుత ఎమ్మెల్యే సభకు మాట్లాడుతుండగా సిపిఎం నాయకులు టి కృష్ణంరాజు, బి రమణ తదితర కార్యకర్తలు అడ్డుతగిలారు. సింహాచలం భూసమస్య పరిష్కరించకపోతే ఎమ్మెల్యే పదవికి ఆరునెలల్లో రాజీనామా చేస్తానని చెప్పిన మీరు ఎందుకు రాజీనామా చేయలేదని సిపిఎం నాయకులు ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. అప్పటిలో మానం అంజనేయులు ఎమ్మెల్యేగా ఉన్నసమయంలో ప్రభుత్వం 578 జివో విడుదల చేస్తే దానికి అడ్డుతగిలింది సిపిఎం పార్టీ కాదా అని ప్రశ్నించారు. దీంతో సిపిఎం నాయకులు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని నినాదాలు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సింహాచలం భూసమస్య కోర్టులో ఉన్నందున తీర్పులకు అనుగుణంగా నడుచుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు .ఈ విషయాన్ని సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో జడ్సీ శివాజీ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.