విశాఖపట్నం

8న విశాఖకు సిఎం రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 3: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 9న విశాఖలో పర్యటించనున్నారు. 8న విశాఖ చేరుకుని, చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. తిరిగి అదేరోజు రాత్రి విశాఖ చేరుకుని ఇక్కడే రాత్రి బసచేస్తారు. 9వ తేదీ ఉదయం నోవాటెల్ హోటల్‌లో జరిగే ఈ గవర్నెన్స్ సదస్సులో పాల్గొంటారు. మధ్యాహ్నం విశాఖ నుంచి బయలుదేరి నర్సీపట్నం నియోజకవర్గం ధర్మసాగరం గ్రామ పంచాయతీలో జరిగే జన్మభూమి-మావూరు కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి అదేరోజు రాత్రి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. అయితే, సిఎం చంద్రబాబు నాయుడు పాల్గొనే ఇతర కార్యక్రమాల్లో ఇంకా స్పష్టత రాలేదని జిల్లా యంత్రాంగం పేర్కొంది.

3.50 లక్షల కొత్త పింఛన్లు పంపిణీ
కె.డి.పేట, జనవరి 3: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. జన్మభూమి మా వూరు గ్రామసభల్లో భాగంగా మంగళవారం గొలుగొండ మండలం విప్పలపాలెంలో మంత్రి పర్యటించారు. ఇక్కడ 80 లక్షలతో నిర్మించనున్న ఆనకట్టు ఎలైన్‌మెంట్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మరో 40 లక్షలతో నిర్మించిన సి.సి. రోడ్డును మంత్రి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన జన్మభూమి సభలో మంత్రి అయ్యన్న మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా 3.50 లక్షల పింఛన్లు, 4.60 లక్షల కొత్త రేషన్‌కార్డులు జన్మభూమిలో పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రెండున్నరేళ్ళ గాదంపాలెం పంచాయతీలో కోటి 25 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కొత్తగా ఇళ్ళు నిర్మించుకునే లబ్ధిదారులకు లక్షన్నర పూర్తి సబ్సిడీతో ఈ ఏడాది ఐదు లక్షల కొత్త ఇళ్ళు మంజూరు చేశామన్నారు. వచ్చే ఏడాది మరో 10 లక్షల ఇళ్ళు నిర్మించేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. రాష్ట్రంలో రెండున్నరేళ్ళలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చారన్నారు. 24 వేల కోట్ల రైతు రుణాలు, 10 వేల కోట్ల డ్వాక్రా రుణాలు రుణ మాఫీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా దేశం ప్రభుత్వం పని చేస్తోందన్నారు. దీనిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయన్నారు. ఈ జన్మభూమి సభలో తెలుగు యువత నాయకుడు విజయ్‌బాబు మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు నిర్ణయం తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను నమ్మరాదన్నారు. గ్రామసభల్లో ఆర్డీవో సూర్యారావు, తహశీల్దార్ అంబేద్కర్, ఎం.పి.పి. సుర్ల లక్ష్మీనారాయణ, ఎం.పి.పి. సుర్ల లక్ష్మీనారాయణ, పార్టీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, పార్టీ కన్వీనర్ చిటికెల సాంభమూర్తి, లగుడు రామ్మూర్తి, పలువురు ఎం.పి.టి.సి.లు, సర్పంచ్‌లతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.