విశాఖపట్నం

జెడ్సీపై న్యాయమూర్తి ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 3: సివిల్ కేసులో న్యాయస్థానం ఆదేశాలు పాటించకుండా నిర్లక్ష్యం వహించిన జివిఎంసి జోనల్ కమిషనర్‌పై 1వ అదనపు సీనియర్ సివిల్ కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫిర్యాదు దారు తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి జివిఎంసి జోన్ 4 జోనల్ కమిషనర్ జీతం నుంచి మొత్తాన్ని రాబట్టాలని ఆదేశిస్తూ జివిఎంసి కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఫిర్యాదు దారు తరపున న్యాయవాది శివప్రసాద్ అందించిన వివరాల ఈ విధంగా ఉన్నాయి. జివిఎంసి జోన్ 4లో శానిటరీ ఇనస్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎ మంగరాజు ఒక వ్యక్తి వద్ద అప్పుతీసుకుని తీర్చలేదు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి బాకీ మొత్తాన్ని వడ్డీతో కలిపి రూ.1.69 లక్షలు మంగరాజు జీతం నుంచి రికవరీ చేయాల్సిందిగా సంబంధిత జోనల్ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. తీర్పు వెలువరించి ఏడాది దాటినా జోనల్ కమిషనర్ జీతం రికవరీకి చర్యలు తీసుకోపోవడంతో మరోసారి ఫిర్యాదు దారు న్యాయస్థా నాన్ని ఆశ్రయించాడు. దీంతో న్యాయమూర్తి జెడ్సీకి మరోసారి షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయినప్పటికీ స్పందించకపోవడంతో న్యాయమూర్తి మంగరాజు బకాయిపడ్డ మొత్తం రికవరీ చేయడంలో విఫలమైన జెడ్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగరాజు చెల్లించాల్సి మొత్తాన్ని జెడ్సీ జీతం నుంచి రికవరీ చేయాల్సిందిగా జివిఎంసి కమిషనర్‌ను ఆదేశించారు.

పేరుకే స్మార్ట్!

విశాఖపట్నం, జనవరి 3: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) పరిధిలో స్మార్ట్ ప్రాంతంగా ఎంపికైన ఆర్‌కె బీచ్ పరిధిలో స్మార్ట్ స్కూల్ ప్రతిపాదన చూస్తే ఎవరికైనా దిమ్మతిరుగుతుంది. స్మార్ట్ స్కూల్స్ అంటే ప్రైవేటు పాఠశాలల్లా బహుళ అంతస్తుల భవనాలు, వాటికి ఆకట్టుకునే రంగులు, అద్దాల కిటికీలు, క్రీడామైదానాలు ఉంటాయనుకుంటే పొరపాటే. ఉన్న స్కూల్ భవనానికి రంగులు వేసి, బెంచీలు, మంచినీటి సదుపాయం కల్పించడంతో పాటు ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయడమే. జివిఎంసి స్మార్ట్ ప్రాంతంగా ఎంపిక చేసిన పరిధిలో ఆరు పాఠశాలలను స్మార్ట్ స్కూల్స్‌గా తీర్చిదిద్దాలని ప్రతిపాదించింది. దీనికోసం స్మార్ట్ ప్రణాళికల రూపకర్త ఎయికాంతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. జివిఎంసి స్మార్ట్‌స్కూల్స్‌గా ఎంపిక చేసిన వాటిలో కెడిపిఎం హైస్కూల్, ఎంవిడి హైస్కూల్, జివిఎంసి హైస్కూల్, శ్రీరంగపురం హైస్కూల్, వాల్తేరు 1, వాల్తేరు 2 స్కూల్స్ ఉన్నాయి. ఈ పాఠశాలలను స్మార్ట్ స్కూల్స్‌గా
తీర్చిదిద్దేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు పూర్తి చేశారు. దీనిపై ఎయికాం సర్వే పూర్తి చేసింది. స్మార్ట్ స్కూల్స్‌లో క్రీడా స్థలం ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం డిజిటల్ తరగతులు, డిజిటల్ లైబ్రరి వంటి సదుపాయాలు మాత్రమే కల్పిస్తారు. దివ్యాంగులకు ఇబ్బంది లేకుండా ర్యాంపులు నిర్మిస్తారు. కొత్తగా తరగతి గదుల నిర్మాణం కానీ, అదనపు వసతుల కల్పన కానీ ప్రతిపాదనల్లో ప్రస్తావించలేదు. అయతే ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిపై నివేదికలు తీసుకున్న స్మార్ట్ ప్రణాళికల రూపకర్త ఉపాధ్యాయుల నియామకంపై స్పష్టత ఇవ్వలేదు. కెడిపిఎం హైస్కూల్‌లో 850 మంది విద్యార్థులు ఉండగా ఇక్కడ విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 1-27గా ఉంది, ఈస్ట్‌పాయింట్ కాలనీలోని ఎంవిడి స్కూల్‌లో ఈ నిష్పత్తి 1-20గాను, శ్రీరంగపురం స్కూల్‌లో 1-22గాను, వాల్తేరు 1 స్కూల్‌లో 1-21, వాల్తేరు 2 స్కూల్‌లో 1-25గాను, జాలరిపేట స్కూల్‌లో 1-40గాను ఉంది. అయితే స్మార్ట్ స్కూల్స్‌లో కొత్తగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయాన్ని మాత్రం ప్రతిపాదనల్లో పొందుపరచలేదు. కేవలం గోడలకు రంగులేసి, ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తేనే స్మార్ట్ స్కూల్స్ పనిపూర్తవుతుందుకుంటే పొరపాటే. ముందు పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే తప్ప విద్యార్థులకు మంచి జరగదన్న వాస్తవాన్ని జివిఎంసి అధికారులు గుర్తుంచుకోవాలి.