విశాఖ

తెలుగు నాటకాన్ని జాతీయస్థాయిలో నిలిపినప్రతిభాశాలి సత్యానంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్.రాయవరం, జనవరి 7: తెలుగు నాటక రంగాన్ని జాతీయస్థాయిలో నిలిపిన మహానటుడు, రచయిత లంకా సత్యానంద్ అని మాజీమంత్రి, నాటక రచయిత దాడి వీరభద్రరావు అన్నారు. అజోవిభొ కందాళం ఫౌండేషన్, శ్రీప్రకాష్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అసిసోయేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 24వ వార్షిక సాహితీ సదస్సులో భాగంగా పాయకరావుపేట ప్రకాష్ కళాశాలల ఆవరణలో నిర్వహించిన విశిష్ఠ రంగ స్థల పురస్కార సభకు వీరభద్రరావు అధ్యక్షత వహించి ప్రసంగించారు.
సత్యానంద్ నటునిగా, దర్శకునిగా, రచయితగా తెలుగు నాటక రంగంలో సుప్రసిద్ధులన్నారు. ఆయన స్థాపించిన నాటక అకాడమీ నుండి అనేకమంది హీరోలుగా చిత్ర పరిశ్రమలో వెలుగొందుతున్నారని ఆయన అన్నారు. సమావేశంలో నాటక రచయిత ఎన్.నర్సింగరావు మాట్లాడుతూ సత్యానంద్ అడవిదివిటీలు, బొమ్మలాట వంటి అద్భుత ప్రదర్శనలతో నాటక రంగాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపారని ఆయన అన్నారు. ప్రముఖ నాటక రచయిత, సినీనటులు వైఎస్ కృష్ణేశ్వరరావు సత్యానంద్ నాటక సేవలను కొనియాడారు. ప్రముఖ పాత్రికేయుడు బివి అప్పారావు తదితరులు నాటక రంగానికి సత్యానంద్ చేస్తున్న సేవలను కొనియాడారు. అంతకుముందు జరిగిన సాహిత్య సదస్సులో డాక్టర్ కె.సాంబశివరావు, దేవరకొండ సుబ్రహ్మణ్యం, బివి రామకృష్ణశాస్ర్తీ, విశాఖ కామెడీ క్లబ్‌కు చెందిన మేడా మస్తాన్ రెడ్డి, రంగస్థల నటి హేమ తదితరులు ప్రసంగించి సత్యానంద్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ప్రాచీన సాహిత్యంలో మేరుశిఖరాలు, నన్నయ నుండి తంకటి దాకా పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాహిత్య రంగాలకు 24సంవత్సరాలుగా కృషిచేస్తున్న అజోవిభో కందాళం ఫౌండేషన్ వారు సత్యానంద్‌ను దుశ్శాలువలతో సత్కరించి 25వేల రూపాయల నగదును అందజేశారు.
ఈ సందర్భంగా పురస్కార గ్రహీత సత్యానంద్ మాట్లాడుతూ తనకు దక్కిన ఈ పురస్కారం తన గురువులకే అంకితమని, జీవితంలో యువతగా ఉన్నప్పుడు దేనిపై ఆశలు పెంచుకుంటామో దానిపైనే దృష్టిసాధ్యమని, దీనికి ఉదాహరణే తన జీవితమని, తనకు నాటకం అన్నీ ఇచ్చిందని అందుకే తనకు నాటకమంటే ఇష్టమని, తాను జీవితంలో నాటకాన్ని తప్ప దేనినీ ఆశించలేదని అందుకే జాతీయస్థాయిలో తనకు గుర్తింపులభించిందని పేర్కొన్నారు. సినీనటులు పవన్‌కల్యాణ్, వరుణ్‌తేజ్, ఆది వంటి సుమారు 50మందికి పైగా హీరోలకు నటనారంగంలో మెళకువలు నేర్పిన ప్రత్యేకత నాదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తనకు జరిగిన సత్కారానికి అజోవిభొ కందాళం ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆకట్టుకున్న
నాటిక ప్రదర్శనలు
రాష్టస్థ్రాయి నాటిక పోటీల్లో భాగంగా శనివారం రాత్రి పాయకరావుపేట శ్రీప్రకాష్ ఆవరణలో ప్రదర్శించిన ‘తేనెటీగ’ నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీకాకుళంలోని ఉరవకొండ శర్వాణీ గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నాటిక గ్రామీణ ప్రాంతంలోని సగటు మనిషి జీవితాన్ని కళ్లకు కట్టేలా ఆవిష్కరించింది. శ్రీ మూర్తి కల్చరల్ అసోసియేషన్ కాకినాడ కళాకారులు ప్రదర్శించిన ‘అంతిమ తీర్పు’ నాటికతోపాటు గుంటూరు అభినయ ఆర్ట్స్ సభ్యులు ప్రదర్శించిన ‘కేవలం మనుషులు’ అనే నాటికలు ఆద్యంతం ప్రేక్షకులను అలరింపజేశాయి.
ఈ కార్యక్రమంలో అజోవిభొ కందాళం ఫౌండేషన్ వ్యవస్థాపకులతోపాటు శ్రీప్రకాష్ విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.