విశాఖ

ప్రజా భాగస్వామ్యంతోనే పార్కుల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 8: విశాఖ స్మార్ట్‌సిటీ లక్ష్యాలను సాధించే క్రమంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయనున్నట్టు మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఆధ్వర్యంలో సంక్షేమ సంఘం సహకారంతో అభివృద్ధి చేసిన పాండురంగాపురం పార్కును శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అలాగే జివిఎంసి పరిధిలోని ప్రతి వార్డులోను ఒకపార్కును మోడల్‌గా ఆధునీకరించనున్నట్టు తెలిపారు. పార్కుల్లో వాతావరణాన్ని ఆహ్లాదకరంగాను, ఆకట్టుకునే విధంగాను తీర్చిదిద్దడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ప్రాంతాలు, పార్కుల అభివృద్ధిలో వుడా, జివిఎంసిలతో పాటు స్థానిక ప్రజా సంఘాలు, సంస్థలు భాగస్వామ్యం ఉంటే సేవలను మరింత విస్తరించేందుకు అస్కారం ఉంటుందన్నారు. సుమారు 80 లక్షల రూపాయల వ్యయంతో పార్కు సుందరీకరణతో పాటు అభివృద్ధి చేశారు. దీనిలో కాలనీ సంక్షేమ సంఘం రూ.55 లక్షలను సమకూర్చగా, మిగిలిన నిధులను వుడా అందజేసింది. పార్కులో రెండంతస్తుల భవనాన్ని నిర్మించి అందులో జిమ్‌ను ఏర్పాటు చేశారు. దీనితో పాటు పార్కులో పిల్లలు, పెద్దలకోసం మరో జిమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రశాంతతకు పెద్ద పీట వేసే విధంగా మొక్కలు, లాన్‌లను తీర్చిదిద్దడమే కాకుండా బుద్దుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. క్రీడా ప్రోత్సాహంలో భాగంగా పార్కులో టెన్నిస్ కోర్టు, గ్రానైట్ పలకలను ఏర్పాటు చేశారు. మంత్రి గంటా వెంట ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్, వుడా ఉపాధ్యక్షుడు బాబూరావు నాయుడు, పాండురంగాపురం రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రామం, ప్రతినిధులు ఉషారాజు, సన్యాసినాయుడు, పెద వీర్రాజు, అబ్బాయి, ఎయు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.