విశాఖ

రేపు సింహాచలేశుని వైకుంఠ ద్వార దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జనవరి 7 : శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారు కొలువుతీరివున్న సింహాచలం క్షేత్రంలో సోమవారం వైకుంఠ ఏకాదశి ఉత్సవం వైభవంగా జరగనుంది. సింహగిరి నరహరి వైకుంఠ నారాయణుడి అలంకారంలో ఉత్తరద్వారంలో భక్తకోటికి తన దర్శన భాగ్యం కలగజేయనున్నారు. ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత స్వామివారిని అర్చకులు సుప్రభాత సేవతో మేల్కొలుతారు. పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం వైదికాధికాలు నిర్వహిస్తారు. సుమారు నాలుగున్నర గంటల సమయంలో ఆలయంలోని ఉత్తరద్వారంలోకి స్వామివారిని తోడ్కొని వస్తారు. అక్కడ సంప్రదాయం ప్రకారం వ్యవస్థాపక ధర్మకర్తల కుటుంబంతో ఈవో రామచంద్రమోహన్, అర్చకులు తొలి దర్శనం చేయిస్తారు. అనంతరం ఉత్తర రాజగోపురంలో ప్రత్యేకంగా తయారుచేసిన వేదిక పై వైకుంఠనారాయణుడి అధిష్టింపజేస్తారు. ఉత్తర ద్వారంలోకి రాగానే స్వామివారి దర్శనం చేసుకునేందుకు వీలుగా భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేంగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పోలీసు అధికారులు పలుమార్లు సింహగిరికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించి వెళ్ళారు. సుమారు మూడు వందల మంది పోలీసులు రెండు షిప్టులుగా విధులు నిర్వహించనున్నారు. వివిద ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేసింది. 37 కెమెరాతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు వైకుంఠద్వారలో సింహాచలేశుని దర్శనం భక్తులకు లభించనుంది. అనంతరం స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సింహగిరి పువీధుల్లో ఊరేగుతారు. తరువాత స్వామివారి అర్జిత నిత్యకల్యాణం నిర్వహిస్తారు. అరవై నుండి డెబ్బై వేల మంది స్వామివారి దర్శనార్థం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజాము నుండి ఆర్టీసీ బస్సులు సింహగిరికి అందుబాటులో ఉంటాయి. 15 వేల మందికి ప్రత్యేక అన్నప్రసాదంతో పాటు భక్తులందరికీ ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తున్నాట్లు అధికారులు ప్రకటించారు. సంప్రదాయంగా వస్తున్న మెట్ల దీపోత్సవానికి అధికారులు సన్నాహాలు చేసారు. తెల్లవారుజామున మూడు గంటలకు దీపారాధన ప్రారంభం కానుంది. దీపారాధన చేసేవారి కోసం నూనె వత్తులను దేవస్థానం ఏర్పాటు చేస్తుంది.