విశాఖ

పోలవరం జలవిద్యుత్ కేంద్రం పనులుత్వరలో ప్రారంభిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, జనవరి 8: ఎన్నో ఏళ్లుగా రాష్ట్రంలో ఎదురుచూస్తున్న పోలవరం జల విద్యుత్ కేంద్రానికి త్వరలో పను లు ప్రారంభించి పూర్తిచేస్తామని ఎపి జెన్‌కో హైడల్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ పర్యటనకు వచ్చిన ఆయన అతిథిగృహంలో విలేఖర్లతో మాట్లాడుతూ పోలవరం పనులు శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో దానికి అనుసంధానంగా ఉన్న డ్యామ్ పనులు కూడా పూర్తికావస్తున్నాయని ఆయన తెలిపారు. పోలవరం జలవిద్యుత్ కేంద్రం పనులు ఇప్పటికే ప్రారంభించాలని సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీచేశారని, ఈనెల ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు పిలుస్తున్నామన్నారు. ఈ ప్రక్రియను నాలుగు నెలల్లో పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. తొలిదశలో మూడు యూనిట్లు ఒక్కొక్క యూనిట్ 80మెగావాట్ల సామర్ధ్యంతో మూడున్నరేళ్లలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకువస్తామని డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. అనంతరం రెండవ దశలో మిగతా తొమ్మిది యూనిట్లు కూడా 58నెలల్లో పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామని డైరెక్టర్ తెలిపారు. దీని ద్వారా ఏడాదికి 2300 (మిలియన్ యూనిట్ల (ఎంయు) విద్యుదుత్పత్తి అందుబాటులోకి వస్తుందని, దీనివలన రూ.230 కోట ఆదాయం సమకూరుతుందన్నారు. దీంతో రాష్ట్రానికి పూర్తిస్థాయిలో విద్యుత్ కొరత తీరుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌కు టెండర్ల ప్రక్రియ జరుగుతుందని, మరో ఏడాదిన్నరలో ఈ సోలార్ పనులు పూర్తిచేసి వినియోగంలోకి తెస్తామన్నారు. మోడల్ ప్రాజెక్టుగా భీమడోలు, గొల్లగూడెం వద్ద పోలవరం రైటు మెయిన్ కెనాల్ బండ్ల వద్ద 35 ఎకరాల్లో ఐదు మెగావాట్ల సోలార్ ప్లాంట్ ద్వారా 25 మిలియన్ యూనిట్లు ఉత్పత్తికి చర్యలు ప్రారంభించామన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాధనలకే పరిమితమవుతున్న ఆంధ్రా, ఒడిశా ఉమ్మడిలో ఉన్న ఏపి పవర్‌హౌస్‌కు స్థల వివాదం ఏకాభిప్రాయానికి వచ్చిందని, ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య ఎంఇవో ఒప్పందాలు కుదిరాయన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఒక్కో యూనిట్ ద్వారా 30మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయగలమని, జోలాపుట్ వద్ద మినీ జలవిద్యుత్ కేంద్రంలో మూడు యూనిట్ల ద్వారా ఒక్కో యూనిట్‌కు ఆరు మెగావాట్ల సామర్ధ్యంతో జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించి అందుబాటులోకి తీసుకురానున్నామని డైరెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో జలవిద్యుత్ కేంద్రాల ద్వారానే అధికంగా విద్యుదుత్పత్తి జరుగుతుందని, మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, మోదుగూడెంతోపాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ ఏడాది టార్గెట్ 3429 మిలియన్ యూనిట్లు కాగా డిసెంబర్ చివరి నాటికి 1552మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశామని ఆయన తెలిపారు. మిగతా టార్గెట్ మార్చి నాటికి పూర్తిచేస్తామన్నారు. అలాగే రాష్ట్రం మొత్తంమీద సీలేరు వాటర్‌బేసిన్ మినహా అన్నిచోట్లా నీటికొరత ఉందన్నారు. బలిమెల జలాశయంలో ఆంధ్రావాటాగా 37టిఎంసిల నీటినిల్వలున్నాయన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది శ్రీశైలంలో విద్యుదుత్పత్తి మెరుగుపడిందన్నారు. గత ఏడాది 200ఎంయు మాత్రమే ఉత్పత్తి జరిగిందని, ఈ ఏడాది శ్రీశైలం టార్గెట్ 1100 కాగా ప్రస్తుతానికి 454ఎంయు ఉత్పత్తి జరిగిందన్నారు. శ్రీశైలంలో పది టిఎంసిల వరకు నీరు ఉండగా అది వాడుకునేందుకు సీలేరు బేసిన్‌లో తక్కువ విద్యుదుత్పత్తి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం గోదావరి డెల్టాకు సీలేరు నుండి నీరు విడుదల చేయలేదని, డిసెంబర్ చివరి వారంలో విద్యుదుత్పత్తి పెంచి వారం రోజులపాటు రోజుకు నాలుగువేల క్యూసెక్కులు ఇచ్చామని, ఒక్కరోజు మాత్రం డొంకరాయి ద్వారా నేరుగా గోదావరిలోకి మూడువేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశామని డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. అనంతరం బలిమెల జలాశయానికి చేరుకుని నీటి నిల్వలను పరిశీలించారు. ఆంధ్రావాటాగా ఎంతనీరు ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జలవిద్యుత్ కేంద్రానికి చేరుకుని ఇంజనీర్లతో సమావేశమయ్యారు. యూనిట్ల పనితీరు గూర్చి డివిజనల్ ఇంజనీర్ సుదాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ మోహనరావు, ఎస్‌ఇలు గోపాలకృష్ణమూర్తి, మురళీమోహన్, ఇఇలు సత్యనారాయణ, విఎల్ రమేష్, చంద్రశేఖర రెడ్డి, డిఇలు సుబ్రహ్మణ్యం, సుదాకర్, ఎడి పాపారావు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన సాహితీ, సాంస్కృతిక సదస్సులు
ఎస్. రాయవరం, జనవరి 8: అజోవిభొ కందాళం ఫౌండేషన్, శ్రీప్రకాష్ విద్యాసంస్థలు సంయుక్తంగా పాయకరావుపేట శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల్లో నిర్వహించిన నాలుగురోజుల సాహితీ సాంస్కృతిక సదస్సులు, తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు ఆదివారం రాత్రి ముగిసాయి. ప్రతిభామూర్తి జీవితకాల పురస్కారాన్ని ఆంధ్రభూమి ఎడిటర్, రచయిత ఎంవిఆర్ శాస్ర్తీకి ఫౌండేషన్ ప్రతినిధులు లక్ష రూపాయల నగదుతోపాటు దుశ్శాలువలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా శాస్ర్తీ సేవలను ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్‌తోపాటు ప్రముఖ సినీనటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు ఉచిత రీతిన ప్రశంసించారు. సభలో దూరదర్శన్ రిటైర్డ్ ఇవో ఓలేటి పార్వతీశం, దండు సూర్యారావు తదితరులు ప్రతిభామూర్తి అవార్డు గ్రహీత సేవలను కొనియాడారు.అవార్డు గ్రహీత ఎంవిఆర్ శాస్ర్తీ మాట్లాడుతూ ఈ సత్కారంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని, దైవమే తనవెంట ఉండి ఈ రచనలు చేయించారని, జాతీయతతో పాటు తెలుగుభాషను రక్షించుకోవడమే తన రచనల ప్రధాన ఉద్దేశ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాటక రచయితలు, ప్రముఖ పాత్రికేయులు, సాహితీవేత్తల ప్రసంగాలు నాలుగురోజులపాటు జరిగాయి. జీవితకాల సాధన పురస్కారం కింద తూము సాంబశివరావును మొదటిరోజు ఫౌండేషన్ సభ్యులు సత్కరించారు. రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సాహితీవేత్త సాహిత్యకృషిపై జగద్ధాత్రిని సన్మానించారు. పలువురు వక్తలు జగద్ధాత్రి సేవలను కొనియాడారు. మూడో రోజు కార్యక్రమంలో భాగంగా నటుడు, రచయిత, దర్శకుడు లంకా సత్యానంద్‌కు విశిష్ట రంగస్థల పురస్కారం అందించి సత్కరించారు. నాలుగు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో అజోవిభొ కందాళం ఫౌండేషన్ నిర్వాహకులు అతిథులను ఆదరించారు.
ఉత్తమ నాటిక
‘స్వర్గానికి వంతెన’
పాయకరావుపేట శ్రీప్రకాష్ కళాశాల ఆవరణలో మూడురోజులపాటు నిర్వహించిన తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు గంగోత్రిసాయి దర్శకత్వం వహించి అరవింద్ ఆర్ట్స్ తాడేపల్లి వారు ప్రదర్శించిన స్వర్గానికి వంతెన నాటికకు ప్రథమ బహుమతిగా ఎంపికైంది. విజే తలకు 25వేల రూపాయల నగదుతోపాటు జ్ఞాపికను అందజేశారు. దండు నాగేశ్వరరావు దర్శకత్వంలో శిరీష ఆర్ట్స్ విశాఖపట్నం వారు ప్రదర్శించిన ఒక రాజకీయ కథ నాటిక ద్వితీయ స్థానానికి ఎంపికైంది. శనివారం రాత్రి ఈ పోటీల్లో చివరగా ప్రదర్శించిన ఈ రెండు నాటికలు కాకతాళీయంగా ప్రథమ, ద్వితీయ స్థానాలకు ఎంపిక కావడం విశేషం. మూడురోజులపాటు ప్రదర్శించిన తొమ్మిది నాటికల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలకు ఈ రెండు నాటికలను ఎంపిక చేసి ఆదివారం సాయంత్రం జీవితకాల పురస్కార సభ అనంతరం నాటిక విజేతలకు బహుమతులను అందజేశారు.