విశాఖ

బ్యాంకుల వద్ద తోపులాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరాపల్లి, జనవరి 9: నోట్లు రద్దయి రెండు నెలలు పూర్తయినా జనాలకు నోట్ల కష్టాలు తీరలేదు. దేవరాపల్లిలోని స్టేట్ బ్యాంకులో అధికంగా ఖాతాదారులు ఉండడంతో ఈ రద్దీ ఎక్కువయ్యింది. ఈ బ్యాంకులో దేవరాపల్లి మండలంతో పా టు అనంతగిరి మండలం పినకోట, పెదకోట, జీనబాడు, కొరపర్తి పంచాయతీలకు చెందిన ప్రజలు ఈ బ్యాంకుకు రావడంతో రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం ఈ రద్దీ పెరిగింది. బ్యాంకులో రద్దీ పెరగడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో చిననంగవరం గ్రామానికి చెంది మజ్జి సముద్రంకు దగ్గరలో ఉన్న గేటులో గుద్దుకోవడంతో తలపై తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అతనిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఈ బ్యాంకులో ఉన్న మేనేజర్ వ్యవహార శైలి బాగోలేదని వచ్చిన ఖాతాదారులు అంటున్నారు. ఇటీవల నోట్లురద్దు వ్యవహారంపై ఖాతాదారులతో వాగ్వివాదం జరిగింది. అప్పటిలో పోలీసులు దగ్గర ఉండడంతో వాగ్వివాదం సద్దుమణిగింది. ఈ బ్యాంకులో నోట్లు రద్దుకాకు ముందు ఇదే పరిస్థితి.

కోడి పుంజులాకు పోలీసుల కాపలా
సబ్బవరం, జనవరి 9: కోడి పుంజులకు ఎలాం టి పరిస్థితుల్లోను అపకారం జరగరానివ్వొద్దని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఇటీవల గుల్లేపల్లి పరిసరాల్లో కోడి పందాలపై జరిపిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న రెండు కోడి పుంజులను కోర్టులో హాజరు పరిచే వరకు వాటిని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. గతంలో కోడి పందాల్లో పట్టుబడిన కోళ్ళు, నగదు, నిందితులను పోలీసులు కోర్టులో హాజరు పరిచగా న్యాయమూర్తులు నిందితులకు జరిమానాలు విధించటం, కోళ్ళను కోర్టు ఆవరణలోనే వేలం వేయటంలాటివి జరిగేవి. కానీ, ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రఘురామరాజు అనే వ్యక్తి సంక్రాంతికి కోడి పందాలకు అనుమతి కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించగా పందాలకు అనుమతి ఇవ్వని న్యాయ స్థానం కోళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకోవద్దంటూ తీర్పువెలువరించిన సంగతి తెల్సిందే. అయితే ఆ తీర్పుకంటే ముందుగానే ఇక్కడి పోలీసులు పట్టుకున్న కొన్నికోళ్ళు సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలుపగా మిగిలిన 2 పందెం కోడి పుంజులను కోర్టులో హాజరు పరిచేందుకు ఉంచారు. ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులను కూడా పోలీసులు నిందితులుగా అరెస్ట్‌చేసిన సంగతి తెల్సిందే. ఈ విషయంపై స్థానిక ఎస్‌ఐ తోట మల్లేశ్వరరావును వివరణ అడగ్గా కోర్టులో జడ్జిగారి ముందు ప్రవేశపెట్టేందుకు ఉంచామన్నారు.