విశాఖపట్నం

ఎంతో గొప్పది మన సంస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, జనవరి 12: మన సంస్కృతి ఎంతో గొప్పది, దానిని భవిష్యత్ తరాల వారికి అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గురువారం ఆంధ్రా యూనివర్సిటీ డాక్టర్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియం ఆవరణలో ప్రభుత్వం తరఫున సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపి హరిబాబు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జెడ్‌పి చైర్‌పర్సన్ లాలం భవానీ, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జిల్లా ఉన్నతస్థాయి అధికారులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్ళను పరిశీలిస్తూ సంబరాల్లో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. ఆడిటోరియం ప్రాంగణం రంగు రంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలతో, తెలుగుదనానికి ప్రతీక అయిన మామిడి, అరటి, కొబ్బరి, చెరకు పందిళ్ళతో సంబరాలకు విచ్చేసిన వారికి ఆహ్వానం పలికాయి. డోలు, సన్నాయి వాయిద్యాలు ఒక పక్క, హరిదాసులు, గంగిరెద్దుల సందడులు మరోపక్క, జానపద కళారూపాలైన తప్పెటగుళ్లు, చెట్ట్భుజన, కోలాటం, సంప్రదాయ నృత్యాలైన కూచిపూడి, భరత నాట్యాలు ఆహూతులకు స్వాగతం పలుకుతూ ఆకట్టుకున్నాయి.
సంప్రదాయ భోగిమంటలు...
పంచాయతీరాజ్‌శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, పార్లమెంటు సభ్యుడు కంభంపాటి హరిబాబు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లాలం భవానీ భాస్కర్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జివిఎంసి కమిషనర్ హరినారాయణన్, జెసి-2 వెంకటరెడ్డి, జిల్లాప్రజాపరిషత్ సిఇఓ జయప్రకాష్ నారాయణన్ స్టాళ్లను సందర్శించి, భోగి పిడకలు వేసి బోగి మంటలు వెలిగించారు. అనంతరం థింసా కళాకారులతో నృత్యం చేశారు. వ్యవసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్ళు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్ర్తి,శిశు సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన స్టాల్ నందు పౌష్టికాహార రకాలు, సంప్రదాయ వంటల ప్రదర్శన, వ్యవసాయశాఖ స్టాల్ నందు సేంద్రియ వ్యవసాయ పద్దతులు, చిరుధాన్యాలతో చేసిన వంటకాలను ప్రదర్శించారు. ఉద్యానశాఖ స్టాల్ నందు పండ్లు, పూలు, మేలుజాతి కూరగాయల ప్రదర్శన, మత్స్యశాఖ స్టాల్‌నందు చేప పిల్లల ప్రదర్శన, పశు సంవర్ధకశాఖ స్టాల్‌నందు పాలు పితికే యంత్రాలను, మేలుజాతి పశువుల పెంపకంపై అవగాహనా అంశాలను ప్రదర్శించారు. సంక్రాంతి సంబరాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. పెందుర్తి, అనకాపల్లి, ముత్యాలపాలెం, రోలుగుంట కూండ్రం జిల్లాప్రజాపరిషత్ హైస్కూలు బాలికలు గొబ్బియల్లో, అష్టలక్ష్మీ వైభవం, దేశభక్తిగీతాలు, మోడ్రన్ కొండ దొరవేషం, కోలాటం, అరకు వ్యాలీ కళాకారులు చేసిన థింసా నృత్యాలు వీక్షకులను ఆనంభరితం చేశాయి. సంక్రాంతి ముగ్గుల పోటీల్లో నాగలక్ష్మి, జి.యువరాణి, దివ్య పవిత్ర ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులందుకున్నారు. పంటల పోటీల్లో చందనలక్ష్మి, ఎం.రాధ, ఎం.వరలక్ష్మి ప్రథమ ద్వితీయ, తృతీయ బహుమతులనందుకున్నారు.