విశాఖపట్నం

భలే బేరం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 15: విశాఖ నగరంలో మద్యం ఏరులై పారింది. ఈ దుకాణాలు మందుబాబులతో నిండా యి. మందుబాబులు దుకాణాల వద్దనే తప్ప తాగి మరీ వీరంగం సృష్టించిన సంఘటనలు పలు చోట్ల చోటుచేసుకున్నాయి. చివరకు జాతీయరహదారి పక్కనే ఉన్న మద్యం దుకాణాలు ఆదివారం ఉదయం నుంచి మందుబాబులతో రద్దీగా కనిపించాయి. కొంతమంది సీసాలు కొనుగోలు చేసుకున్న సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశాలకు వెళ్లిపోగా, మరికొంతమంది రెస్టారెంట్లు వద్దనే గడిపారు. దాబాలు సైతం ఎప్పుడూ లేనివిధంగా మందుబాబులతో కళకళలాడాయి. అసలే ఆదివారం కనుము పండుగ రావడంతో మద్యం దుకాణాలన్నింటికీ డిమాండ్ ఏర్పడింది. కొన్ని దుకాణాల వద్ద క్యూకట్టడం దర్శనమిచ్చింది. నగరంలోని వన్‌టౌను, పూర్ణామార్కెట్ ఏరియా, కంచరపాలెంమెట్టు, బర్మాక్యాంపు, రాంజీఎస్టేట్, 104 ఏరియా, మర్రిపాలెం, హెచ్‌బి కాలనీ, అక్కయపాలెం, కైలాసపురం, తాటిచెట్లపాలెం, దొండపర్తి, అక్కయపాలెం, సీతమ్మపేట, ఆరిలోవ, ప్రాంతాల్లో ఉండే మురికివాడల్లో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు చిందులు వేయడం కనిపించింది. అలాగే జాతీయ రహదారి హనుమంతవాక జంక్షన్, ఎండాడ, కారుషెడ్ ఏరియా, మధురవాడ, బోయిపాలెం, కాపులుప్పాడ, కొమ్మాది తదితర పరిసరాల్లో మద్యం దుకాణాల వద్ద రద్దీ, మందుబాబుల చిందులతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం కనుము పండుగ రావడంతో కోట్లాది రూపాయల విలువైన మేకలు, గొర్రెలతోపాటు, కోళ్ళ ప్రాణా లు గాలిలో కలిసిపోయాయి. వీటి కోసం ఆదివారం తెల్లవారుజాము నుం చి వినియోగదారులకు దుకాణాలకు చేరుకోవడం కనిపించింది. అలాగే కోళ్ళకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. నాటు కోళ్లు కనీసం వెయ్యి రూపాయలు ఇస్తే తప్ప దొరకని పరిస్థితులున్నాయి. కాస్తంత తక్కువ ధరకు లభించే ఫారం కోళ్ళ మాంసం విక్రయా లు విపరీతంగా సాగాయి. మేక మాం సం కిలో రూ.600లకు చేరుకుంది. అయినా మాంసం దుకాణాల వద్ద రద్దీ తగ్గలేదు.
* పట్టణ శివారుల్లో కోడి పందేలు..
నగర శివారుప్రాంతాలు పిఎం పా లెం, శంభువానిపాలెం,దబ్బంద, కొమ్మా ది, బొట్టవానిపాలెం, మధురవాడ వాంబేకాలనీ, రేవళ్లపాలెం, సమీపంలో ఉన్న కొండ ప్రాంతాలు, తోటల్లోకి వెళ్ళి మరీ కోడి పందేళ్ళు జోరుగా సాగించారు. ఈ పందేలు పోలీసుల కళ్ళుగప్పి కొన్నిచోట్ల నిర్వహించగా, మరికొన్ని ప్రాంతాల్లో వీరి కన్నుసన్నల్లోనే జరగడం గమనార్హం. మునుపెన్నడూలేనివిధంగా సాగిన కోడి పందేళ్ళల్లో చనిపోయిన కోళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. హనుమంత జంక్షన్ వద్ద నున్న మేకల కబేళాను నగర శివారు ప్రాంతం బోయిపాలెం సమీపానికి తరలించిన యథావిధిగా వీటి అమ్మకాలు సాగుతూనే ఉన్నాయి.