విశాఖ

వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, జనవరి 15: కనుమపండుగ రోజు మండలంలో హత్య, కారు బీభత్సం రోడ్డు ప్రమాదం సంఘటనలో ముగ్గురు మృతి చెందడంతో మండల వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేరువేరుచోట్ల జరిగిన ఈ మూడు ప్రమాద సంఘటనలో కలకలంరేపాయి. వివాహిత హత్య, దహనం,వివాహితను కొంతమంది దుండగులు హత్యచేసి దహనం చేసిన సంఘటన మండలంలోని అడ్డూరు, నరసాపురం మధ్యగల అటవీశాఖకు చెందిన జీడిమామిడితోటలో ఆదివారం వెలుగుచూసింది. 65 శాతం కాలిపోయిన మహిళ మృత దేహాన్ని పశువుల కాపరులకు కనిపించడంతో భయాందోళనకు గురై వారు పరుగుపరుగున నరసాపురం విఆర్‌ఓకు సమాచారం అందజేశారు. ఈ సంఘటనకు సంబంధించి చోడవరం సిఐ వై మురళీరావు, ఎస్.ఐ పిఎన్ మూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సమీపంలోని బీరుబాటిల్స్, మృతదేహం కాలిమెట్లు, ముఖం చుట్టూ తారపా చుట్టి ఉండటంతో కొంతమంది దుండగులు ఈ వివాహితను తీసుకువచ్చి అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అనుమానం కూడా రేకెతిస్తుంది. ఈ నేపథ్యంలోని పోలీసులు క్లూస్‌టీంను కూడా రప్పించి సంఘటనా స్థలంలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సంఘటన నరసాపురం, అడ్డూరు గ్రామాలతో పాటు మండలంలోని కూడా తీవ్ర సంచలనం కలిగించింది. మరో సంఘటనలో పట్టణంలోని లక్ష్మీసినీమ్యాక్స్ ప్రదర్శించబడుతున్న చలనచిత్రం చూసేందుకు అంకుపాలెంకు చెందిన కోరుకొండ నాగరాజమ్మ (35) థియోటర్ వద్ద నిలుచుని ఉంది. ఇదే సమయంలో కారు వేగంగా వచ్చి ఆమెను ఢీకొంది. దీంతో ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో వారిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు కింతలి వల్లాపురం గ్రామనికి చెందిన గండి ప్రసాద్, కశింకోట మండలం కొత్తపల్లి, బుచ్చెయ్యపేటకు చెందిన గాడి వరలక్ష్మీగా గుర్తించారు. అలాగే రోడ్డు ప్రమాదంలో స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్ వద్ద బస్సుకోసం వేచి ఉన్న బుచ్చెయ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామానికి చెందిన కశిరెడ్డి రమణ (27), అడువుల అగ్రహారం అత్తవారి ఇంటికి వెళ్లేందుకు బస్సుకోసం వేచి ఉండగా పాడేరు వైపు నుండి విశాఖ వైపు వెళ్తున్న ఆర్‌టిసి బస్సు వేగంగా దూసుకువచ్చి రమణను ఢీకొది. ఈ ప్రమాదంలో రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయా ప్రమాదాలుపై అందిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సముద్రంలో ఇద్దరు గల్లంతు
* దార్లపూడిలో విషాదం
ఎస్.రాయవరం, జనవరి 15: పొట్టికూటికోసం రాజస్థాన్ నుం డి వచ్చి ఇక్కడకు సమీపంలోని దార్లపూడిలోని స్వీట్‌షాప్ నిర్వహిస్తున్న ఇద్దరు యువకులు సరదాగా సముద్రంలోకి స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ఆదివారం ఈ విషాద సంఘటన జరిగింది. దార్లపూడిలోని రాజస్థాన్ నుండి పనిచేసేందుకు వచ్చిన ప్రేమ్‌సింగ్ (21), యహూబ్‌సాహూ (25) మరో యువకుడు మండలంలోని రేవుపోలవరం సముద్ర తీరానికి వెళ్లారు. సాహూ, ప్రేమ్‌సింగ్‌లు సముద్రంలో స్నానానికి దిగి అలలు తాకిడితో గలంతైయ్యారు. యలమంచిలి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామారావు, సబ్‌ఇన్‌స్పెక్టర్ అరుణకుమార్ సంఘటనా స్థలంకు వెళ్లి మృతదేహాల గాలింపుకోసం జాలర్లు ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబీకులు సంఘటనా స్థలంలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దార్లపూడిలో విషాదచాయలు అలముకున్నాయి.