విశాఖపట్నం

రైళ్ళు రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 16: సంక్రాంతి పండుగ సం దడి అంతా విశాఖ రైల్వేస్టేషన్‌లో కనిపిస్తోంది. మూడు రోజుల పండుగతో సొంత గ్రామాలకు, పట్టణాలకు వచ్చిన వీరంతా సోమవారం నుంచి తిరుగు ముఖం పడుతున్నారు.మూడు రోజులపాటు సరదాగా గడిపిన వీరితో సందడి ఉండే ఇళ్ళు ఇపుడు బోసిపోతుండగా, ఈ హడావుడి అంతా రైల్వేస్టేషన్‌లో కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది. పిల్లాపాపలతో, ఇంటిళ్ళపాది ఇళ్ళ నుంచి బయలుదేరి వచ్చే వలస కూలీలు, ఏడాది మొత్తం మీద ఇపుడు ఒక్కసారే సెలవులపై ఇళ్ళకు వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే సాధారణ ఉద్యోగులు, నిత్యం వ్యాపారలతో సతమతమవుతూ మూడు రోజుల కుటుంబాలతో సంతోషంగా గడిపే వ్యాపారస్తులు, చిరు ఉద్యోగులతో విశాఖ రైల్వేస్టేషన్ నిండిపోయింది. ఈ విధంగా రైళ్ళే కాకుండా ఎనిమిది ప్లాట్‌ఫారాలు, ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు, చివరకు ప్రధాన రిజర్వేషన్ కాంప్లెక్స్, జనరల్ బుకింగ్ కౌంటర్లు ప్రయాణికులు, వీరిని సాగనంపేందుకు స్టేషన్‌కు చేరుకునే బంధువులతో సందడిగా మారింది. దీనివల్ల అక్కడకక్కడ స్వల్ప తోపులాట నెలకుంటుంది.
* పాసింజర్లలో ఒంటి కాల ప్రయాణం
కోర్బా, పలాస, గుణుపూర్,రాయగడ, రాజమండ్రి, కాకినాడ, సింహాద్రి తదితర పాసింజర్ రైళ్ళు ప్రయా ణం సాహసంతో కూడుకున్నదిగా మారిపోయాయి. వీటిలో ఎక్కువశాతం మంది చిరు ఉద్యోగులు, వలస కూలీలు, సాధారణ మహిళలు ఉంటున్నందున ఒంటి కాలపైనే వీరంతా బయలుదేరి వెళ్తున్నారు. తక్కువ చార్జీలతో ఎక్కువ దూరం వెళ్ళేందుకు అదీ ఇంటిళ్ళపాది తమ వెంట ఉండే లగేజీలతోపాటు వెళ్ళే అవకాశం ఒక్క పాసింజర్ రైళ్ళల్లోనే ఉన్నందున వీటిపైని సామాన్యులు ఆధారపడుతున్నారు.