విశాఖ

రైల్వే స్టేషన్లో నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 16: గణతంత్ర వేడుకలు సమీపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన రైల్వేస్టేషన్నంటినీ కేంద్రం అప్రమత్తం చేస్తుంది. ఇందులోభాగంగా స్మార్ట్ స్టేషన్‌గా అభివృద్ధి చెందుతోన్న, ఆంధ్ర రాష్ట్రంలోనే ముఖ్యమైన విశాఖ రైల్వేస్టేషన్‌లో భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు ముఖ్య పట్టణాలు, రైల్వేస్టేషన్లలో ఉగ్రవాదుల కార్యకలాపాలు నిర్వహించే అవకాశాలపై సందేహాలు వ్యక్తమవుతుండడంతో అంతా హై ఎలర్ట్ ప్రకటించనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమైన విశాఖ రైల్వేస్టేషన్‌లో భద్రతను మరింతగా పెంచాలని నిర్ణయించారు. దేశ నలుమూలల నుంచి నడిచే రైళ్ళన్నీ విశాఖకు నిత్యం వస్తుంటాయి. ప్రధానంగా బంగ్లాదేశ్‌కు చెందిన వారికి దేశంలో పలు రాష్ట్రాలకు వెళ్ళాలంటే ఇదే మార్గం. అలాగే ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గడ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ళన్నీ విశాఖ మీదుగానే విజయవాడ, సికింద్రాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబై వంటి ముఖ్య నగరాలకు సూపర్‌పాస్ట్‌లు, ఎక్స్‌ప్రెస్‌లు, ప్రత్యేక రైళ్ళు నిత్యం నడుస్తున్నాయి. దీనిని దృష్టిలోపెట్టుకుని విశాఖ రైల్వేస్టేషన్‌లో భద్రతాపరంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీసులు (జిఆర్‌పి), నగర పోలీసులు ఇప్పటికే ప్రత్యేక చర్యలు చేపట్టారు. దాదాపు 50 క్లోజుడ్ సర్క్యూట్ టివీలతో నిఘా కొనసాగుతోంది. మరోపక్క అనుమానితులు, అసాంఘిక శక్తులపై 24 గంటలు పోలీసు బృందాలు పర్యవేక్షణ పెట్టారు. అనుమానాస్పద పరిస్థితుల్లో స్టేషన్ ప్లాట్‌ఫారాలపైన, రైళ్ళల్లో సంచరించే అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించడం, చోరీలకు తావు లేకుండా, తొక్కిసలాట జరుగకుండా ఉండేందుకుగాను ఎక్స్‌ప్రెస్ రైళ్ళ వద్ద ప్రయాణికుల క్యూలైన్లు నిర్వహించడం, 24 గంటలు విశాఖ రైల్వేస్టేషన్‌లో పోలీసు బందోబస్త్ పహారా, ప్రధాన గేట్ల వద్ద ప్రయాణికులను నిశితంగా తనిఖీలు జరపడం, డాగ్‌స్వ్కాడ్, మెటల్ డిటెక్టర్‌తో పరిశీలించడం వంటివి చేపట్టనున్నారు. గణతంత్ర వేడుకులకు మరో పది రోజులు మాత్రమే సమయం ఉన్నందున ప్లాట్‌ఫారాలు, ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు, విఐపి లాంజ్‌లు, ఏసి విశ్రాంతి హాళ్ళు, ప్రధాన రిజర్వేషన్ కాంప్లెక్స్, జనరల్ బుకింగ్ కౌంటర్లు, జ్ఞానాపురం రైల్వేస్టేషన్, పార్శిళ్ళ కార్యాలయం, నార్త్ కేబిన్, స్టేషన్‌లో పలు విభాగాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నారు.
* చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
నిత్యం చిల్లర దొంగతనాలకు పాల్పడే అంతరాష్ట్ర ముఠాల నుంచి ప్రయాణికులకు అవగాహన కల్పించడంలో భాగంగా, నేరాలను అదుపులోకి తెచ్చేందుకు వీలుగా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పాత నేరస్తులపై నిఘా పెట్టడం, ఎక్స్‌ప్రెస్ రైళ్ళల్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు బందోబస్త్ నిర్వహించడం, అంతరాష్ట్ర ముఠాల కదలికలను పసిగట్టడం వంటివి పోలీసు బృందాలు చేపడుతున్నాయి. పది రోజులపాటు స్టేషన్‌లో పార్శిళ్ళ కార్యాలయం, గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్, గరీబ్థ్,్ర దురంతా తదితర ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌పాస్ట్‌ల్లో ఏసి కోచ్‌లపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు.