విశాఖపట్నం

గడువులోగా పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 16: గృహ నిర్మాణాలను నిర్దిష్ట గడువులోపు పూర్తిచేసేందుకు ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని, గృహ నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పిఎంఏవై, ఎన్టీఆర్, హుదూద్ గృహ నిర్మాణాలపై గృహ నిర్మాణశాఖ పిడి, డిఇ, ఏఇలతో సమీక్షించారు. జిల్లాలో గృహాల గ్రౌండింగ్స్‌కు పని సంతృప్తిగా లేదని, ఇకపై ప్రతి సోమవారం సమీక్షిస్తానని, పురోగతి కనపడకోతే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జన్మభూమి కమిటీలు, శాసనసభ్యులు సమన్వయంతో నిర్మాణాలు త్వరగా ప్రారంభించేలా చూడాలని, ప్రారంభానికి ముందుకు రాని లబ్ధిదారుల గృహాలను శాసనసభ్యుల సలహాల మేరకు రద్దు చేయాలన్నారు. వచ్చే సోమవారం కాంట్రాక్టర్లతో కూడా సమావేశం నిర్వహిస్తానని, ఇకపై ప్రతి రెండు వారాలకోసారి కాంట్రాక్టర్లను కూడా పిలిచి సమీక్షిస్తానన్నారు. హుదూద్ గృహాలు మార్చి నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉందని, గృహాలతోపాటు సిసి రోడ్లు, డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకులు, కల్వర్టులు, విద్యుత్, నీటి సరఫరా తదితర వౌలిక వసతులను కూడా పూర్తి చేయాలన్నారు. హుదూద్ గృహాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సమీక్షిస్తున్నారని, త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. గృహనిర్మాణశాఖ పిడి, ఇఇలు ఎప్పటికపుడు పనులపై తనిఖీలు చేయాలన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ కింద జిల్లాలో 11,589 గృహాలను మంజూరు చేయగా 42 శాతం ఆఫ్‌లైన్, 16 శాతం ఆన్‌లైన్‌లో గ్రౌండిం గ్ అయ్యాయని, 4873 గృహాలకు జియో ట్యాగింగ్ జరిగిందని, మన జిల్లా వెనుకబడి ఉందని, పక్క జిల్లాలతో పోటీ పడి పనిచేయాలన్నారు. వారం వారం పురోగతి కనపడాలని, ప్రగతిలో ముందున్ని మొదటి ఐదు మండలాలను, ఆఖరనున్న ఐదు మండలాలను గుర్తించాలని, మండల వారీగా ప్రగతిని అంచనా వేయడం జరుగుతుందన్నారు. భూ సమస్యలు, సర్వే సమస్యలు ఉంటే సంయుక్త కలెక్టర్‌ర్‌తో మాట్లాడి పరిష్కరించుకోవావలన్నారు. సమావేశంలో హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రసాద్, డ్వామా పిడి కల్యాణ చక్రవర్తి, ఇఇలు డిఇ, ఏఇలు హాజరయ్యారు.