విశాఖపట్నం

గణతంత్ర వేడుకలకు సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 19: జిల్లా కేంద్రంలోని పోలీసు బ్యారెక్స్‌లో నిర్వహించనున్న గణతంత్ర వేడుకల్లో జిల్లా ప్రగతిని ప్రతిబింబించేలా శకటాలను ప్రదర్శించాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వివిధ ప్రభుత్వశాఖల అధికారులను ఆదేశించారు. గణతంత్ర వేడుకుల నిర్వహణపై గురువారం కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షించారు. 16 ప్రభుత్వ శాఖలు తమ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను శకటాల రూపంలో ప్రదర్శించాలన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో మోటారు సైకిళ్ళపై విన్యాసాల నిర్వహణ ఈ ఏడాది వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందన్నారు. సుమారు 15 నిమిషాల పాటు శిక్షణ పొందిన పోలీసులు ఈ విన్యాసాలు ప్రదర్శిస్తారన్నారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వివిధ పథకాల కోసం ఎంపికైన లబ్ధిదారులకు యూనిట్లు, ఆస్తుల పంపిణీ కూడా చేపట్టాలన్నారు. గణతంత్ర వేడుకుల్లో ప్లాస్టిక్ వినియోగానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని, తాగునీటిని ప్యాకెట్ల ద్వారా అందించకుండా డిస్పోజబుల్ గ్లాసుల ద్వారా జీవిఎంసి ఆధ్వర్యంలో అందించాలన్నారు. పోలీసు మైదానంలో అవసరమైన మేరకు మరమ్మత్తులు పూర్తిచేసి వేడుకలకు సిద్దం చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖాధికారులు తమతమ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన ఇద్దరు అధికారులు, సిబ్బంది పేర్లను ప్రశంసాపత్రాలకు సిఫారసు చేయాలన కలెక్టర్ ఆదేశించారు. గణతంత్ర వేడుకల ఉపన్యాసానికి సంబంధించి అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వశాఖలు శుక్రవారం నాటికి సమాచారశాఖ ఉప సంచాలకులకు అందించాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో ఇరవై నిమిషాలకు మించకుండా విద్యార్ధినీ, విద్యార్ధులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డిసిపి నవీన్ గులాటి, డిఆర్‌ఓ సి.చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.