విశాఖ

జాతర చూతము రారండి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జనవరి 20: సంక్రాంతి ఉత్సవాల్లో ఉత్తర కోస్తా జిల్లాలకే ప్రసిద్ధిగాంచిన స్థానిక వేల్పులవీధి గౌరీపరమేశ్వరుల జాతర మహోత్సవం శనివారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు పూర్తిచేశారు. ప్రతీఏటా సంక్రాంతి పండుగ తరువాత వచ్చే శనివారం రోజున విధిగా నిర్వహించే ఈ ఉత్సవానికి జిల్లా నలుమూలల నుండే కాక ఇతర సుదూర ప్రాంతాల నుండి సైతం అనూహ్య సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ప్రతీనెలా జనవరి నెలాఖరున గవరపాలెం గౌరమ్మ జాతర జరగగా అందుకు ముందు శనివారం వేల్పులవీధి గౌరమ్మ జాతర విధిగా ఆకట్టుకుంటుంది. రెండు ప్రధాన సామాజిక వర్గాల వారు పోటాపోటీగా ఈ జాతర మహోత్సవాలు నిర్వహిస్తుంటారు. బెల్లం వ్యాపారులు, కార్మికులు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించే గవరపాలెం ప్రాంతంలోని గౌరమ్మ జాతరకు దీటుగా కాపు సామాజిక వర్గ వర్గీయులు వేల్పులవీధి గౌరమ్మ జాతరను నిర్వహిస్తుంటారు. అయితే, వేల్పులవీధి గౌరమ్మ జాతర సువిశాలమైన రోడ్ల మధ్య ఏర్పాటు చేసిన వేదికలతో అన్నివర్గాల వారు తిలకించేందుకు అనువుగా ఇక్కడి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జాతర మహోత్సవం సందర్భంగా మెయిన్‌రోడ్డులోని వేల్పులవీధి గౌరమ్మ ఆలయం వద్ద, చిన నాలుగురోడ్ల కూడలిలోను, నెహ్రూచౌక్ కూడలిలోను 30నుండి 50 అడుగుల ఎత్తులో ఉండే భారీ విద్యుద్ధీకరణ లైటింగ్ సెట్టింగ్‌లను ఏర్పాటు చేశారు. ఆకర్షణీయమైన విద్యుద్ధీపాలతో మెయిన్‌రోడ్డులోని అన్ని ప్రధాన మార్గాలను అలంకరించారు. ఉత్సవంలో భాగంగా నాలుగు ప్రధాన వేదిక కార్యక్రమాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేశారు. వివిధ సాంస్కృతిక, జానపద వేదిక ప్రదర్శనలతోపాటు ప్రత్యేకతను సంతరించుకున్న నేలవేషాలను ఈ ఉత్సవంలో భాగంగా ఏర్పాటుచేశారు. జాతరలో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటాక ఇక్కడి మున్సిపల్ స్టేడియంలో మందుగుండు సీతారామయ్య బాణసంచా ప్రదర్శనను తిలకించేందుకు సందర్శకులు అనూహ్య సంఖ్యలో ఉబలాటపడుతుంటారు. జాతర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని డిఎస్పీ పురుషోత్తం తెలిపారు.