విశాఖ

మంచినీటి కోసం మహిళల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదబయలు, జనవరి 20: మండలంలోని సీతగుంట గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉండడంతో ఇక్కట్లకు గురవుతున్నామని గ్రామానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో శుక్రవారం ప్రదర్శన చేపట్టారు. పంచాయతీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా జరగకపోవడంతో మంచినీటి కోసం నానా అవస్థలు పడుతున్నామన్నారు. పైలట్ ప్రాజెక్టు నీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు గౌరవ వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడంతో కార్మికులు నీటిని విడుదల చేయకపోవడంతో సీతగుంటతో పాటు రోగులపేట, పులుసుమామిడి, బంగారుమెట్ట, పనె్నడ తదితర గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. దీంతో మంచినీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నీటిని నిల్వ చేస్తున్న ట్యాంక్ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో నీరు నిండుకుని వృథాగా పోతోందని వారు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని, పైలట్ ప్రాజెక్టు పథకం కార్మికులకు ప్రభుత్వం నెలవారీ వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడంతోనే కార్మికులు నీటిని విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచినీటి కష్టాలు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.
ఘనంగా మరిడిమాంబ తీర్థం
చీడికాడ, జనవరి 20: మండలంలో అర్జునగిరి గ్రామంలో శుక్రవారం మరిడిమాంబ తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుండి భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మేజర్ పంచాయతీ కెజెపురం గ్రామంలో కూడా దుర్గమాంబ తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.