విశాఖ

కనీస వేతనాల కోసం స్కీమ్ వర్కర్ల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, జనవరి 20: కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు అరికట్టాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఆశా, మధ్యాహ్న భోజన పథకం, ఎస్‌ఎఫ్‌ఐ, ఐసిడిటి తదితర సంఘాలకు చెందిన పనివార్లు సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ జరిపి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కొత్తూరు జంక్షన్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ముందుగా స్థానిక సిఐటియు కార్యాలయం నుండి పెద్దఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు సాగింది. తహశీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి మాట్లాడుతూ స్కీమ్‌వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయన్నారు. అర్హులైన వారిని ఎఎన్‌ఎంలుగా శిక్షనిచ్చి, ఇప్పటికే శిక్షణ పొందిన వారిని రెండో ఎఎన్‌ఎంలుగా తీసుకోవాలన్నారు. భోజన పథకం రాష్ట్ర అధ్యక్షురాలు వరలక్ష్మి మాట్లాడుతూ వంటల నిర్వాహకులకు కనీస వేతనం ఐదువేలు ఇవ్వాలని, పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదని, ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణం బకాయిలు చెల్లించి వేతన సదుపాయం కల్పించాలని ఆమె కోరారు. అనంతరం కొత్తూరు కూడలి వద్ద సుమారు అరగంటపాటు రాస్తారోకో జరిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్ల జిల్లా అధ్యక్షురాలు బి.రామలక్ష్మి, సిఐటియు మండల కార్యదర్శి బి.చంద్రరావు, ఆర్.బుచ్చిరాజమ్మ, ఎం.రమణ, ఎన్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సాగరం భూములకు సాగునీరు అందించాలి
మాడుగుల(రూరల్), జనవరి 20: మండలంలోని సాగరం పాతూరు గ్రామం భూములకు సాగునీరు అందించాలని రైతులు ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుకు విన్నవించుకున్నారు. శుక్రవారం గడపగడపకూ వైకాపా కార్యక్రమానికి సాగరం పాతూరు వచ్చిన ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుకు గ్రామస్తులు తమ గోడు వినిపించారు. తమ భూములకు రిజర్వాయర్ కాలువ డి.గోటివాడ గ్రామం నుండి తమ గ్రామం వరకు ఉందని ఈ కాలువ పూర్తిగా మరమ్మతులకు గురై సాగునీరు అందటం లేదని రైతులు వివరించారు.
దీనిపై ఎమ్మెల్యే వెంటనే సంబందిత నీటిపారుదళశాఖ డిఈతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ కాలువకు వెంటనే మరమ్మతులు చేపట్టి సాగునీరు అందిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం గ్రామంలో ఇటీవల చెట్టుపై నుండి పడిపోయి నడుము విరిగి తీవ్రంగా బాధపడుతున్న సియాద్రి మహలక్ష్మిని పరామర్శించి, ఆయనకు రూ, 2000, మరో ఇద్దరికి ఆర్థిక సహాయం అందించారు. అలాగే పలువురు తమకు పింఛన్ల్, రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తాళపురెడ్డి రాజారాం, గొల్లవిల్లి సంజీవి, రామధర్మజ, దుడ్డు అప్పలనాయుడు, శ్రీనాథు జగ్గారావు, దాసరి కొండబాబు పాల్గొన్నారు.