విశాఖ

సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 21: ఈ నెల 27,28 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్షించారు. నగరంలోని ప్రభుత్వం అతిధిగృహంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, పోలీసు కమిషనర్ యోగానంద్, ఇతర అధికారులతో సమావేశమైన ఆయన గతేడాది విశాఖ వేదికగా నిర్వహించిన భాగస్వామ్య సదస్సు విజయవంతమైందన్నారు. తొలి భాగస్వామ్య సదస్సులో సుమారు రూ.4.67 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదిరాయన్నారు. వీటిలో కొన్ని పరిశ్రమలు ఇప్పటికే పనులు ప్రారంభించగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయన్నారు. గత సదస్సు ఒప్పందాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శిల సంయుక్త సారధ్యంలో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ ఎంఓయులపై నిరంతరం మోనిటరింగ్ చేస్తోందన్నారు. గత సదస్సుకు సంబంధించి 45 శాతం ఒప్పందాలు కార్యరూపం దాల్చాయని, దీనికి చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ కారణంగా పేర్కొన్నారు. తాజాగా రెండు రోజుల పాటు జరిగే భాగస్వామ్య సదస్సుకు 50 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. దేశం నలుమూలల నుంచి దాదాపు 2000 మంది పారిశ్రామిక వేత్తలు, 15 దేశాలకు చెందిన మంత్రులు హాజరవుతున్నట్టు వెల్లడించారు. రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగరంలో ఉండి సదస్సు నిర్వహిస్తారన్నారు. సదస్సులో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశోక్ గజపతిరాజు, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, తదితులు హాజరుకానున్నట్టు తెలిపారు. ఏరోస్పేస్, టెక్స్‌టైల్స్, బయోటెక్ తదితర పరిశ్రమల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు తెలిపారు. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఎపికి బెస్ట్‌గా నిలిచిందన్నారు. సమీక్షలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.