విశాఖ

మావోల అడ్డాలో అధికారులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జనవరి 23: మావోయిస్టుల అడ్డాగా ఉన్న విశాఖ మన్యంలోని పెదబయలు మండలం ఇంజరి గ్రామంలో జిల్లా ఉన్నత అధికారులు సోమవారం అడుగుపెట్టారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, రూరల్ ఎస్.పి. రాహుల్‌దేవ్ శర్మ, పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇంజరి గ్రామానికి చేరుకుని ఆ ప్రాంత గిరిజనులతో సద్భావన యాత్ర నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మావోయిస్టులకు నిలయంగా ఉన్న మారుమూల ప్రాంతమైన ఇంజరి గ్రామానికి హెల్‌కాప్టర్‌లో జిల్లా ఉన్నత అధికారులు చేరుకోవడం సర్వాత్రా చర్చానీయాంశంగా మారింది. ఏజెన్సీలో మావోయిస్టుల ప్రాబల్యం అంతంత మాత్రంగానే ఉన్న గ్రామాలకు కనీసం మండల స్థాయి అధికారులు కూడా వెళ్లేందుకు సాహసించని పరిస్థితి మన్యంలో తరచుగా కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో కలెక్టర్, ఎస్.పి. వంటి కీలకమైన అధికారులు మావోయిస్టుల అడ్డాలో అడుగుపెట్టడంలో గల ఆంతర్యమేమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసు శాఖ ఏజెన్సీలో సద్బావన యాత్ర లు నిర్వహిస్తున్నప్పటికీ మావోల ప్రాబల్యం ఉన్న గ్రామాలలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అన్నది అంతతమాత్రంగానే ఉంటున్నా మారుమూల ప్రాంతాలలోనైతే ఇటువంటి సాహసం చేసే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో సద్భావన యాత్ర పేరిట మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఇంజరి గ్రామానికి హెలికాప్టర్ ద్వారా వెళ్లాల్సిన అవసరం ఏమిటనేది అంతుచిక్కని మరో ప్రశ్నగా మారింది. అయితే ఇంజరి గ్రామానికి ఉన్నత అధికారులను పం పించడం ద్వారా మావోయిస్టుల మానసిక స్ధైర్యాన్ని దెబ్బతీయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన బెజ్జంగి అటవీ ప్రాంతంలో అక్టోబర్ 24న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అగ్రనేతలతో సహా 24 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్ సం ఘటన మావోలకు కోలుకోలేని దెబ్బతీసిందనే చెప్పాలి. అయితే బెజ్జంగి ఎన్‌కౌంటర్ తరువాత ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుముఖం పట్టిందని, వారి ఉనికి కరువయ్యిందని పోలీసు ఉన్నత అధికారులు ఇంతవరకు చెప్పుకువచ్చారు. మావోయిస్టుల ప్రాబల్యం అంతరించిపోయిందని ఒకవైపు చెప్పుకువచ్చిన పోలీసు పెద్దలు మరోవైపు ఎన్‌కౌంటర్‌కు ప్రతీకార చర్యగా మావోలు విధ్వాంసాలకు పాల్పడవచ్చునని భావిం చి ఇందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటునే ఉన్నారు. బెజ్జంగి అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ అనంతరం దాదాపు మూడు నెలల పాటు మావోయిస్టుల కదలికలు ఈ ప్రాంతంలో తగ్గినప్పటికీ ఇటీవల కాలంలో వారి కార్యకలాపాలు జోరందుకున్నాయని తెలుస్తోంది. విశాఖ మన్యంలో మావోయిస్టుల కదలికలు ఊపందుకోవడాన్ని గుర్తించిన పోలీసు ఉన్నత అధికారులు వారి ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీసేందుకు పలు వ్యూహాలను అమలు చేస్తున్నారని, ఇందులోభాగంగానే కలెక్టర్, ఎస్.పి. వంటి జిల్లా ఉన్నత అధికారులు మావోల అడ్డాలో అడుగుపెట్టడానికి కారణమని తెలుస్తోంది. రోడ్టు మార్గంలో ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉన్నప్పటికీ మావోయిస్టుల నుంచి ఎదురయ్యే ముప్పును గుర్తించి అధికారులు హెలికాప్టర్ ద్వారా ఈ గ్రామానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఉన్నత అధికారులు మావోల అడ్డాలో అడుగుపెడుతుండడంతో ఇంజరి ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. రెండు రోజులకు ముందుగానే పోలీసు బలగాలు ఇంజరి ప్రాంతాన్ని జల్లెడపట్టి పలు కోణాలలో భద్రతా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కలెక్టర్, ఎస్.పి. పర్యటించిన హెలికాప్టర్ ఇంజరి గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని కొండ ప్రాంతంలో దించి, ఆ ప్రాంతం నుంచి ఇంజరి గ్రామానికి కొండల్లో అధికారులు నడిచిరావడం కూడ పోలీసు పెద్దల వ్యూహంలోమరో భాగమని తెలుస్తోంది. జిల్లా అధికారులు ఇంజరి గ్రామంలో అడుగుపెట్టిన నుంచి వారు పాల్గొన్న కార్యక్రమాల ప్రాంతాలకు నాలుగు దిక్కులా రెండు కిలోమీటర్ల మేర పోలీసు బలగాలను మోహరించి అణువణువునా విస్తృత తనిఖీలు నిర్వహించడం ఈ సందర్భంగా గమనార్హం. జిల్లా అధికారులు సాహసోపేతంగా ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పటికీ పోలీసుల పహరాలో ఇంజరి గ్రామాన్ని సందర్శించడం వెనుక గిరిజనుల సమస్యలు తెలుసుకోవాలన్న తపన కంటే మావోయిస్టులకు గుణపాఠం చెప్పాలన్న వ్యూహమే దాగి ఉందని పలు వర్గాల చర్చించుకోవడం కనిపించింది.