విశాఖ

అన్ని గ్రామాలకూ మంచినీటి సదుపాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదబయలు, జనవరి 23: మండలంలోని ఇంజరి పంచాయితీ పరిధిలో గల అన్ని గ్రామాలకు గ్రావిటీ పథకం ద్వారా మంచినీటి సదుపాయం కల్పిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఇంజరి గ్రామంలో విశాఖ పోలీస్, పాడేరు ఐ.టి.డి.ఎ. ఆధ్వర్యంలో నిర్వహించిన సద్భావన యాత్ర కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకే మీ ముందుకు వచ్చానన్నారు. సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఇంజరి, జొడియాపుట్టు, ననబరి, జక్కుం, చీకుపనస, సాలేబులు, గినె్నగరువు, గిండెలు, సరియాపల్లి, మాలసీతకోట మూలలోవ తదితర గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు వారి సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఇంజరి పంచాయతీలోని గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. గ్యాస కనెక్షన్లను మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఇంజరి గ్రామంలో పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలని గ్రామస్థులు కోరడంతో స్పందించిన ఆయన రెండు నెలల వ్యవధిలోనే అంగన్‌వాడీ భవనం పూర్తి చేసి ఐ.సి.డి.ఎస్. అప్పగించాలని, పాఠశాలకు కూడా పక్కా భవనాన్ని నిర్మించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. డి.ఆర్.డిపో లేకపోవడంతో 15 కిలోమీటర్లు దూరం ప్రయాణించి నిత్యావసర వస్తువులు తీసుకోవాల్సి వస్తోందని, దీంతో అనేక అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా డి.ఆర్.డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో పాఠశాల ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు లేకపోవడంతో సుమారు 40 మంది విద్యార్థుల చదువు కుంటుపడుతోందన్నారు. వెంటనే ఉపాధ్యాయుడ్ని నియమించాలని గ్రామస్థులు కోరడంతో ఆ పాఠశాలకు సి.ఆర్.టి.ని నియమించాలని, పాఠశాల సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఎం.ఇ.ఒ. కు సూచించారు. పంచాయతీలో ఇన్‌చార్జి వి.ఆర్.ఒ. విధులు నిర్వర్తిస్తుండడంతో తమ సమస్యలను పరిష్కరించుకోలేకపోతున్నామని, నూతనంగా వి.ఆర్.ఒ.ను నియమించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా శాశ్వత వి.ఆర్.ఒ.ను నియమిస్తామని గిరిజనులకు ఆయన హామీ ఇచ్చారు. ఇంజరిలో రవాణా సౌకర్యం లేక అనేక అవస్తలు పడుతున్నామని పంచాయతీ కలెక్టర్ ప్రవీణ్‌కుమర్‌ను కోరగా రహదారి నిర్మాణం కోసం పి.ఎం.జి.ఎస్.వై. నిధులు మంజూరయ్యిందని, త్వరలో రహదారి పనులు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. రహదారి పనులు ప్రారంభించేటప్పుడు ఎవరైనా అడ్డుకుంటే వారిపై పంచాయతీ వాసులే తిరుగుబాటు చేసి రహదారిని నిర్మించుకునేలా చూడాలని ఆయన సూచించారు. ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ కొంతమందికి వేలి ముద్రలు పడకపోవడం వలన ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నామని, మండల కేంద్రానికి వెళ్లి ఆధార్ నమోదు చేసుకునేందుకు వెళ్ళేందుకూ కష్టతరంగా ఉందని కలెక్టర్‌కు విన్నవించుకోవడంతో ఆదార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసి వేలిముద్రలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. గ్రామంలో నెలకొన్న భూసమస్యలు పరిష్కరిస్తామని, అర్హులైన వారికి ఎన్.టి.ఆర్. గృహాలు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జన్మభూమిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కరించాలని గ్రామస్థులు కోరడంతో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, ఐ.టి.డి.ఎ. పి.ఒ. రవి సుభాష్, ఒ.ఎస్.డి. అట్టాడ బాబూజీ, పాడేరు డి.ఎస్.పి. మహేంద్ర, సి.ఐ. మోహన్‌రావు, ఎంపీడీఓ సత్యనారాయణ, తహశీల్థార్ సుధాకర్, ఎం.ఇ.ఒ. సువర్ణరాజు, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు.