విశాఖపట్నం

అభివృద్ధికి చేయూత నౌకా పర్యాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 23: విశాఖలో నౌకా పర్యాటక రంగం అభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించేందుకు నెదర్లాండ్‌కు చెందిన బృందం విశాఖ సందర్శించింది. హెన్రిక్ డిక్ సారధ్యంలోని సభ్యుల బృందం విశాఖ పోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్ పిఎల్ హరినాథ్‌ను సోమవారం కలిసి పలు అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా నెదర్లాండ్స్ ప్రతినిధి హెన్రిక్ మాట్లాడుతూ నౌకా పర్యాటకం ద్వారా విస్తృత స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉందని, దీని ప్రాధాన్యతలపై హెన్రిక్ సమగ్రంగా వివరించారు. విశాఖ పోర్టు ట్రస్టు నేతృత్వంలో నౌకా పర్యాటకాన్ని విస్తృత పరిచే అవకాశాలను సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా నౌకా పర్యాటకం అభివృద్ధికి సంబంధించి సమగ్ర ప్రణాళికతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న అత్యుత్తమ నౌకా పర్యాటక పద్ధతులను ప్రస్తావించారు. అలాగే విశాఖ పోర్టు ట్రస్టు ద్వారా నౌకా పర్యాటకాభివృద్ధికి అవసరమైన వౌలిక సదుపాయా, ప్రాధాన్యతాలను వివరించారు. అలాగే పర్యావరణ హితంగా నౌకా పర్యాటకాన్ని ప్రాధాన్యతాంశంగా చేపట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు. అనంతరం నెదర్లాండ్స్ బృందం సభ్యులు పోర్టును సందర్శించి నౌకా పర్యాటకానికి అనువైన అన్ని అంశాలను పరిశీలించారు.