విశాఖ

రహదారి భద్రతపై చైతన్యం పెంపొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జనవరి 23: రహదారి భద్రతపై వాహనదారుల్లో చైతన్యం పెంపొందించాలని, వారిపై కేసులు బనాయించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని స్థానిక ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.స్థానిక రావుగోపాలరావు కళాక్షేత్రంలో అనకాపల్లి రోడ్డు రవాణాశాఖ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఉపన్యశించారు. ఆటోలు, జీపులు ఇతరత్రా వాహనాలు నడుపుతూ వేలాదిమంది నిరుపేదలు ఉపాధి పొందుతున్నారన్నారు. రహదారి భద్రతా చర్యలు చేపట్టలేదని, వారిపై కేసులు బనాయించి పెద్దమొత్తంలో అపరాధ రుసుంలు వసూలు చేయడం వలన వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. క్రమేపీ వారిలో రహదారి భద్రతపై అవగాహన కల్పించి వారిలో మానసికమైన మార్పులు తీసుకువచ్చే దిశగా రోడ్డు రవాణా శాఖ కృషిచేయాలన్నారు. సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మె ల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు అప్పగించడం వలన ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయన్నారు. ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొనడం వల్ల సంభవించే ప్రమాదాలకం టే స్వయంకృతాపరాదం వలన, మద్యం తాగి వాహనాలు నడపటం తదితర చర్యల వలనే ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడటంలో ఎవరికి వారే స్వచ్ఛందంగా బాధ్యతలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల వలన ఇంటికి పెద్దదిక్కును కోల్పోతున్నారని, అభం శుభం తెలియని పసిబాలురు ఇంటిపెద్దలు దుర్మరణం చెందడం వలన రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతివ్యక్తి విధిగా హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకతపై అవసరమయితే కేసులు నమోదు చేసినా తప్పులేదన్నారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రహదారి భద్రత గూర్చి తమ శాఖ చేపడుతున్న కృషిని వివరించారు. అనకాపల్లి ప్రాంతీయ రవాణా శాఖాధికారి ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు సిహెచ్ శ్రీనివాస్, కెఎల్ కిషోర్, ఉషశ్రీ తదితరులతోపాటు వివిధ వాహనాల డ్రైవర్లు, ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు.