విశాఖ

పని చేయని హెల్ప్‌లైను నెంబర్లు సిబిఎస్‌ఇ తీరుపై విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 10: ప్రతిష్టాత్మకమైన ఐఐటి, ఎన్‌ఐటి తదితర సంస్థల్లో ప్రవేశానికి సంబంధించి జెఇఇ (మెయిన్) ఆన్‌లైన్ పరీక్ష నగరంలో ఆదివారం జరిగింది. వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ పరీక్షను నిర్వహించారు. అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో నగరానికి దూరంగా ఉన్న కళాశాలల్లో నిర్వహించారు. 10 కళాశాలల్లో ఈ పరీక్షను నిర్వహించారు. అయితే ఏమైనా ఇబ్బందులు ఎదురైతే సహాయం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్న సిబిఎస్‌ఇ అధికారులు హెల్ప్‌లైన్ నెంబర్లను తమ వెబ్‌సైట్‌లో ఉంచారు. అయితే వెబ్‌సైట్‌లో హెల్‌లైన్ నెంబర్లు అంటూ ఏడు నెంబర్లను, టోల్‌ఫ్రీ నెంబరును ఇచ్చారు. కానీ ఆ నెంబర్లు ఏమీ కూడా ఆదివారం పని చేయలేదు. దీంతో పరీక్ష కేంద్రాల సమాచారం తెలుసుకునేందుకు అభ్యర్థులు కొంత ఇబ్బంది పడ్డారు. పరీక్షల నిర్వహణకు గురించి జిల్లా యంత్రాంగానికి లేదా మీడియాకు కనీస సమాచారం లేకపోవడం గమనార్హం. నగరంలో వివిధ కళాశాలలు, ఎయు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నప్పటికీ నగరానికి దూరంగా ఉన్న కళాశాలల్లో పరీక్ష నిర్వహించారు. విశాఖకు జెఇఇ (మెయిన్) ఆఫ్‌లైను సెంటరు ఇచ్చినప్పటికీ, వాటి గురించి చివరి నిమిషంలో జిల్లా యంత్రానికి తెలియడంలో హడావుడిగా ఏర్పాట్లు చేశారు. ఇతర నగరాల్లో వివిధ కళాశాల యాజమాన్యాలు, పాఠశాలలు, అధికార యంత్రాంగం అభ్యర్థులుకు, వారి తల్లితండ్రులకు పరీక్షా కేంద్రాలకు రవాణా, వసతి వంటి సౌకర్యాలు కల్పించారు. చాలా చోట్ల హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కానీ విశాఖలో ఆ పరిస్థితి లేదు. సిబిఎస్‌ఇ అధికారులు ఈ విషయమై దృష్టి సారించి అభ్యర్థులకు, వీలైనంత వరకూ సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.