విశాఖపట్నం

హోదా హీట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 26: ప్రత్యేక హోదా ఉద్యమానికి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మద్దతు పలకడంతో పాటు విపక్ష నేత వైఎస్ జగన్ అదేరోజు విశాఖలో పార్టీ తరఫున జరిగే కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనాలని నిర్ణయించారు. ఆంధ్రా యువత పేరిట ఆర్కే బీచ్ వేదికగా జరిగే వౌన దీక్షతో పాటు వైకాపా తలపెట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనను నిలువరించేందుకు పోలీసులు తమదైన వ్యూహాన్ని అమలు చేశారు. హోదా పేరిట జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో పోలీసులు విజయం సాధించారు. విశాఖ జిల్లాతో పాటు అనంతపురం, నెల్లూరు, ఇతర జిల్లాల నుంచి పోలీసులను బందోబస్తు నిమిత్తం విశాఖ తరలించారు. రెండు రోజులుగా హోదా ఉద్యమానికి అనుమతిలేదంటూ ప్రకటిస్తున్న అధికారులు, పోలీసులు ప్రదర్శనలు నిర్వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వారు హెచ్చరించినట్టే గురువారం నగరంలో జరిగిన వౌనదీక్ష, కొవ్వొత్తుల ర్యాలీలను నిలువరించారు. ఉదయం ఆరు గంటల నుంచి ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో ఏ ఒక్కరినీ అనుమతించలేదు. ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిపై కూడా ఆంక్షలు విధించారు. గుర్తింపు కార్డులున్న వారిని మాత్రమే వారు బీచ్‌రోడ్డులోకి అనుమతించారు. దీంతో పలువురు ఇళ్లకు చేరుకునేందుకు సైతం ఇబ్బంది పడాల్సి వచ్చింది. చినవాల్తేరు నుంచి పార్క్ హోటల్ వరకూ ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు. అలాగే కిర్లంపూడి లేఅవుట్, పాండురంగా పురం, హార్బర్ పార్క్ ఏరియాల్లో పోలీసులు అవుట్‌పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా బీచ్‌రోడ్డులోకి ఏవరూ చొరబడకుండా అడ్డుకున్నారు. కోస్టల్ బ్యాటరీ, పార్క్ హోటల్ వరకూ వద్ద కీలక పాయింట్లను ఏర్పాటు చేసిన పోలీసులు ఇక్కడ నలుగురేసి ఎసిపిలు సహా వందల సంఖ్యలో పోలీసులు, భద్రతా దళాలను మొహరించారు. గాలి కూడా చొరబడకుండా బీచ్‌రోడ్డును దిగ్భంధనం చేశారు. పాండురంగా పురం, పందిమెట్ట, జిల్లా పరిషత్, కెజిహెచ్ డౌన్ ప్రాంతాల్లో మొహరించిన పోలీసులు కోస్టల్ బ్యారీవైపు రాకపోకలను పూర్తిగా అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో పలు ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్ సెంటర్లు ఉండటంతో తీవ్ర అసౌకార్యానికి గురయ్యారు. ఇదిలా ఉండగా నగరంలో ఆర్కే బీచ్‌లో జరిగే వౌన దీక్షకు పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత తరలివస్తారని భావించిన ప్రభుత్వం, పోలీసులు వీరిని అడ్డుకునేందుకు వ్యూహాత్మకమైన వైఖరిని అవలంభించింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఈ ఉద్యమంలో పాలుపంచుకోకుండా అన్ని కోణాల్లోను ప్రయత్నించి సఫలమైంది. కళాశాల విద్యార్థులు ఉద్యమంలో పాల్గొంటే ప్రాక్టికల్స్‌లో మార్కులు వేసేది లేదని హెచ్చరించడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం తమ పిల్లలను పంపితే వారి భవిష్యత్ నాశనమవుతుందంటూ సమాచారాన్ని చేరవేశారు. దీంతో హోదా ఉద్యమంలో పాల్గొనాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ, విద్యార్థులు వెనుకంజవేశారు. పోలీసు కేసుల కారణంగా తమ పిల్లల జీవితాలు ఎక్కడ పోనాశనమైపోతాయోనని తల్లిదండ్రులు కట్టడి చేశారు. ఈ విధంగా ఒక బలమైన విద్యార్థి వర్గాన్ని ఉద్యమానికి దూరంగా ఉంచే ప్రయత్నంలో ప్రభుత్వ వ్యూహం ఫలించింది.
వైకాపా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ విజయవంతం కాకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తూ కార్యకర్తలకు నాయకత్వం లేకుండా చేశారు. ముఖ్యంగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణను మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో అరెస్టు చేయడంతో కార్యకర్తలకు సారధ్యం లేకుండా చేయగలిగారు. దీంతో కార్యకర్తలు అయోమయం నుంచి తేరుకునేలోగానే వైకాపా అధినేత జగన్ విశాఖ చేరుకోవడం పోలీసులు అడ్డుకోవడంతో ఆయన తిరిగి వెళ్లిపోవడం జరిగిపోయింది. మొత్తానికి ఉధృత ప్రచారం జరిగిన ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చల్లార్చే క్రమంలో పోలీసులు విజయం సాధించారనే చెప్పాలి