విశాఖ

ఎస్సీ, ఎస్టీనిధులు పక్కదారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం,జనవరి 29: ఎస్సీ, ఎస్టీల కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపిం చారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల హక్కు ల సాధనకై సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా చైతన్యయాత్ర ఆదివారం రాత్రి నర్సీపట్నం చేరుకుంది. స్థానిక అబీద్ సెంటర్‌లోని డాక్టర్ బి.అర్. అంబేద్కర్ విగ్రహానికి రామకృష్ణతో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వ కేటాయించిన నిధుల్లో సంగం నిధులు కూడా ఆయా వర్గాల అభివృద్ధికి ఖర్చు చేయడం లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ఫ్లాన్‌కు 3,100 కోట్లు నిధులు కేటాయించగా కేవలం వెయ్యి కోట్లు మాత్రమే బి.సి. సంక్షేమం కూడా కుంటుపడిందన్నారు, 8 వేల కోట్లకు పైగా బడ్జెట్‌లో కేటాయించగా 1,800 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మంత్రి వర్గంలో మైనార్టీ గిరిజన వర్గాలకు ప్రాతినిధ్యమే లేకుండా పోయిందన్నారు. 4,5 శాతంగా ఉన్న వర్గాల వారికి పదవులు దక్కాయన్నారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. విద్య, వైద్యంను కార్పొరేట్ రంగాలకు అప్పగిస్తుందన్నారు.బలహీన వర్గాల వారికి ఇళ్ళు,స్థలాలు లేవన్నారు. రెండున్నరేళ్ళ పాలనలో ఒక్క ఎకరా భూమి కూడా పేదవారికరి ఇచ్చిన పాపాన ఈ ప్రభుత్వం పోలేదన్నారు. కోనేరు రంగారావు సిఫార్సులను అమలు చేయాలని తమ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసిందన్నారు. అణగారిన వర్గాల కోసమే తాము సామాజిక వేదిక హక్కుల ఆధ్వర్యంలో ప్రజా చైతన్యయాత్రలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో యాత్ర పూర్తయిన అనంతరం అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.
* ప్రచారం తప్పా పరిశ్రమలు లేవు
రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయంటూ ప్రచార ఆర్భాటం తప్పా ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి వచ్చిన దాఖలాలు లేవన్నారు. గత ఏడాది విశాఖలో నిర్వహించిన పారిశ్రామికుల సదస్సులో ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి ప్రచారం చేశారని, కేవలం 101 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. పరిశ్రమలు ఎక్కడ ప్రారంభం అయ్యాయో చెబితే తాము మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. రాష్ట్రంలో 10 వేల మందికి కూడా ఉద్యోగాలు లభించలేదన్నారు. పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం శే్వత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ఫ్యాకేజీని ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రదాన మంత్రితో మాట్లాడే దమ్ము లేక ప్రత్యేక ఫ్యాకేజీ అంటూ ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని మండిపడ్డారు.
* పవన్‌తో చేతులు కలుపుతాం
రానున్న రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో చేతులు కలుపుతామని సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. అణగారిన వర్గాల కోసం అన్ని వర్గాలు కలవాల్సిన అవసరం ఉందన్నారు. వీరు డిమాం డ్లు సాధించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో పవన్‌తో కలిసి పని చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో సిపిఐ. రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణమూర్తి, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు జె.వి. ప్రభాకర్, ఎ. ఐ.టి.యు.సి. రాష్ట్ర కార్యదర్శి ఓబులేసు, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు దుర్గ్భావానీ, సి.పి.ఐ. జిల్లా సహాయ కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సి.బి. ఎం. కాంపౌండ్ వద్ద ప్రజా చైతన్యయాత్రకు సి.పి. ఐ. నాయకులతో పాటు సి.పి.ఎం. నాయకులు డి.సత్తిబాబు, సాపిరెడ్డి నారాయణమూర్తి తదితరులు స్వాగతం పలికారు.