విశాఖ

డయల్ యువర్ కమిషనర్‌కు 17 ఫిర్యాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 30: జివిఎంసి ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ (నెంబర్ 1800-4250-0009) కార్యక్రమానికి 17 ఫిర్యాదులు అందాయి. అదనపు కమిషనర్ (ఫైనాన్స్) ఎస్‌ఎస్ వర్మ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి హాజరై పలువురి నుండి వచ్చిన ఫోన్‌కాల్స్‌కు సమాధానం చెప్పారు. ఇందలో ఒకటో జోన్-4, రెండో జోన్-2,దవ జోన్-4, ఆరో జోన్-4, పిర్యాదులు అందాయి. ఈ పిర్యాదులను స్వయంగా పరిశీలించి మూడు రోజులుగా నివేదిక సమర్పించాలన్నారు.
తెనే్నటి పార్కు వద్ద స్వచ్ఛ్భారత్

విశాఖపట్నం, జనవరి 30: స్థానిక కైలాసగిరి సమీపంలోని తెనే్నటి పార్కులో గీతం విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) గీతం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈఐఈ విభాగం వలంటీర్ల ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 80 మందికి పైగా విద్యార్ధులు ఆదివారం తెల్లవారుజాము నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని తెనే్నటి పార్కు పరిసరాలను శుభ్రం చేశారు. పార్కులో వ్యర్ధాలను తొలగించి మొక్కలకు నీరు అందే విధంగా పాదులు సరి చేయడంతోపాటు సందర్శకులకు పరిశుభ్రత పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తెనే్నటి పార్కును గీతం విశ్వవిద్యాలయం దత్తత స్వీకరించిన నేపధ్యంలో గత ఏడాది నుంచి క్రమం తప్పక స్వచ్ఛ భారత్‌ను నిర్వహిస్తున్నామని, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు స్ఫూర్తిదాయకంగా ఇందులో పాల్గొంటున్నారని గీతం విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎమ్.పోతరాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మీప్రసాద్, ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ స్వామి, ఈఇఈ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎలిజబెత్ రాణి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ మండల్ తదితరులు పాల్గొన్నారు.