విశాఖపట్నం

నేరాల నియంత్రణకు అన్ని శాఖల అధికారుల సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (క్రైం), జనవరి 30: అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నగరంలో నేరాల శాతం తగ్గేలా పోలీసులు కృషి చేయాలని నగర పోలీసు కమిషనర్ టి.యోగానంద్ సూచించారు. సోమవారం నగరంలోని జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాలులో అన్ని శాఖల అధికారులతో కలసి సిపి అర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ఆధునిక పద్ధతులను ఉపయోగించుకుని మోడలింగ్ పోలీసు సిస్టమ్‌ను సిబ్బంది అలవరుచుకోవాలన్నారు. కేసుల దర్యాప్తులో అప్రమత్తంగా ఉండి ఆయా శాఖలకు సంబంధించిన అధికారుల సహాయాన్ని తీసుకోవాలన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిందని, వాటిని నియంత్రించడానికి జివిఎంసి సిబ్బంది సహాయంతో పాటు ట్రాన్స్‌పోర్టు అధికారుల అవసరం కూడా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భూకబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి రెవెన్యూ అధికారులతో సమన్వయం అవసరమన్నారు. స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న విశాఖలో నేరాల నియంత్రణకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో సిపి, పోలీసు అధికారులతో పాటు జ్యుడీషియల్, ఎలక్ట్రికల్, రెవెన్యూ, మెరైన్, జివిఎంసి, ట్రాన్స్‌పోర్టు, జైలు అధికారులు పాల్గొన్నారు.