విశాఖ

సిసి కెమెరాలతో నేరాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి(నెహ్రూచౌక్), జనవరి 31: ప్రతీచోటా సిసి కెమెరాలు ఏర్పాటుతో పట్టణంలో నేరాలను నియంత్రించవచ్చని, అలాగే పట్టణంలో ట్రాఫిక్ సమస్యను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్‌నుంచి పర్యవేక్షించి తద్వారా చర్యలు తీసుకోనున్నట్టు ఎస్పీ రాహూల్‌దేవ్ శర్మ తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో సిసి కెమెరాల కంట్రోల్‌రూమ్‌ను ఎస్పీ, జివిఎంసి కమిషనర్ హరినారాయణ్ ప్రారంభించారు. పూడిమడక రోడ్డు, నెహ్రూచౌక్ జంక్షన్, బైపాస్ జంక్షన్, చిననాలుగురోడ్ల జంక్షన్‌లలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి పట్టణంలో సుమారు 17 సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందుకు సంబంధించిన కంట్రోల్ రూమ్‌ను పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విశాఖలో ట్రాఫిక్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఇక్కడ కూడా అమలుచేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు కృషిచేస్తామన్నారు. పట్టణంలో వాహనాల పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించాలని ట్రాఫిక్ పోలీసులకు ఆయన సూచించారు. ఈవ్‌టీజింగ్, ద్విచక్ర వాహన దొంగతనాలు, చైన్‌స్నాచింగ్ తదితర నేరాలను సిసి కెమెరాల ద్వారా తెలుసుకోవడం సులభతరమవుతుందన్నారు. ఈ మధ్య కాలంలో తిరుపతిలో నాలుగు దొంగతనాలు జరిగితే సిసి కెమెరాల ద్వారానే తెలుసుకున్నారని తెలిపారు. సబ్బవరం, తాళ్లపాలెం, నర్సీపట్నం ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాలను ఇప్పటికే ఏర్పాటు చేశామని, సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న నేరాలను సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షించి కంట్రోల్‌రూమ్‌లో రికార్డవుతుందని తద్వారా నేరాలు ఏ విధంగా జరిగాయనేది తెలుసుకోవడం సులభతరమవుతుందన్నారు. జివిఎంసి కమిషనర్ హరినారాయణ్ మాట్లాడుతూ సిసి కెమెరాల వలన ప్రజలకు భద్రత ఏర్పడుతుందని, విశాఖతో సమానంగా అనకాపల్లి పోలీసులు కూడా తమ జివిఎంసి నుండి అవసరమైన సహాయం పొందవచ్చన్నారు. సిఎం చంద్రబాబునాయుడు ఎల్లప్పుడూ ప్రతీ సమీక్షలోను టెక్నాలజీ కోసమే చెబుతూ వాటిని వినియోగించి పట్టణాభివృద్ధి చేసుకోవాలని ఎప్పటికప్పుడు సమావేశాల్లో చెబుతూనే ఉంటారన్నారు. ఈ మధ్యకాలంలో యువత మద్యం సేవించి వాహనాలు నడిపి తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని, విశాఖలో ఉన్న నిబంధనలను ఇక్కడ విధించి ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసి, రికార్డులు సక్రమంగా లేనివారిపై చర్యలు తీసుకునేందుకు దృష్టిసారిస్తున్నామని ఆయన అన్నారు. పట్టణంలోని కొన్ని ప్రధాన సెంటర్లలో సిగ్నల్ లైట్లను ఏర్పాటు చేయాల్సినవసరం ఉందన్నారు. త్వరలోనే సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే పీలా మాట్లాడుతూ విశాఖడెయిరీ సహకారంతో సిసి కెమెరాలు, సిగ్నల్ లైట్లు అందజేసేందుకు డెయిరీ చైర్మన్ తులసీరావు సానుకూలత వ్యక్తం చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ అనె్నపు పురుషోత్తం, పట్టణ సిఐ విద్యాసాగర్, జార్జి క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కొణతాల మురళీకృష్ణ, మళ్ల సూరిబాబు, ఆడారి రాజశేఖర్, యల్లంకి సత్తిబాబు, ఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.