విశాఖ

ఎస్సీ, ఎస్టీ సబ్ ఫ్లాన్ నిధులతో అభివృద్ధి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, జనవరి 31: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ చింతకాయల అనిత కోరారు. మంగళవారం జరిగిన పాలకవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎస్సీ సబ్ ఫ్లాన్ కింద ప్రభుత్వం మున్సిపాలిటీకి 10 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో 19వ వార్డులో కోటి 70 లక్షలతో సి.సి. రోడ్లు, మురుగు కాలువలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఎస్టీలకు 17వ వార్డులో అభివృద్ధి పనులకు 30 లక్షలు కేటాయించామన్నారు. కౌన్సిలర్ రావాడనాయుడు మాట్లాడుతూ మంత్రి అయ్యన్నపాత్రుడు కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నారని, ఈ నిధులతో చేపట్టే పనులు నాణ్యతతో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. తమ వార్డుల్లో మంచినీటికి ఇబ్బందులు పడుతున్నామని వైకాపా కౌన్సిలర్ సుబ్బలక్ష్మి, గొలుసు సుమజ, పలువురు టిడిపి కౌన్సిలర్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మంచినీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ సురేంద్ర సభ్యులకు హామీ ఇచ్చారు. తమ వార్డులో మురుగునీరు పేరుకుపోయి దోమలు వ్యాప్తి చెందాయని, ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కౌన్సిలర్ సుమజ తెలిపారు. 18 వార్డులో మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నామని కౌన్సిలర్ తెలిపారు. తమ వార్డులో పైప్‌లైన్లు విస్తరించాలని సుబ్బలక్ష్మి కోరారు. అనంతరం వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు బడ్జెట్‌పై మాట్లాడారు. ఇంటి పన్నుల ద్వారా సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు ఆదాయం లభించిందన్నారు. రానున్న కాలంలో ఉద్యోగులకు జీతాల సమస్య ఉండదన్నారు. శివారు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు వేసేందుకు వీలుగా 150 విద్యుత్ స్థంబాల కొనుగోలుకు బడ్జెట్‌లో ప్రతిపాదించాలని సూచించారు.
మున్సిపాలిటీలో 467 కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని, ఈనెల 1వ తేదీ నుండి కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మొత్తం పంపిణీ చేస్తామన్నారు. ఈసమావేశంలో కమిషనర్ జంపా సురేంద్ర, మున్సిపల్ కౌన్సిలర్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

విలీన గ్రామాల్లోనూ సకల సౌకర్యాలు
అనకాపల్లి(నెహ్రూచౌక్), జనవరి 31: పట్టణానికి దీటుగా విలీన గ్రామాలను కూడా అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు జివిఎంసి నుండి ప్రత్యేక నిధులను మంజూరు చేస్తామని జివిఎంసి మెయిన్ కమిషనర్ హరినారాయణ్ అన్నారు. మంగళవారం అనకాపల్లి జివిఎంసిలో విలీనమైన వల్లూరు, రాజుపాలెం, కొప్పాక గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణతోపాటు సుడిగాలి పర్యటన చేశారు. ఆయా గ్రామాల్లో డ్రైన్లు, సిసి రోడ్లు, మంచినీరు తదితర వౌలిక వసతుల సమస్యలపై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లుపై ప్రవహిస్తున్న మురుగునీటిని చూసి ఆయన అసహనం వ్యక్తం చేశారు. అనకాపల్లి పట్టణంతోపాటు విలీన గ్రామాలను అభివృద్ధి చేయాల్సినవసరం ఉందని ఆయన అన్నారు. అనంతరం స్థానిక జోనల్ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జివిఎంసిలో అభివృద్ధి పనులకు 200 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరయ్యాయని, దీంతో పట్టణంలోని విలీన గ్రామాల్లో చేయాల్సిన అభివృద్ధి పనులను త్వరలోనే చేపడతామన్నారు.పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రతీ ఒక్కరూ పరిశుభ్రత పాటించి, జివిఎంసి ఏర్పాటు చేసిన డస్ట్‌బిన్‌ల్లోనే వేయాలని, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి జోనల్ కమిషనర్ షేక్ సుబానీ, ఎస్‌ఐ ఆనందరావు, శివప్రసాద్, ఎఇ రాజేంద్రకృష్ణ, డిఇ భాస్కరరావు, ఎసిపి సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాసరావు, మళ్ల సురేంద్ర పాల్గొన్నారు.