విశాఖపట్నం

ఉత్సవ్‌లో అదరహో అనిపించిన కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 4 : విశాఖ సాగరతీరంలో పోటీ పడుతూ విశాఖ ఉత్సవ్ సంబరాలు శనివారం ఉవ్వెత్తున ఎగిశాయి. ఆర్‌కె బీచ్‌లోని ప్రధాన వేదిక వద్ద ఆబాలగోపాలం స్కాృంతిక అంశాలకు నృత్యంతో హోరెత్తించారు. స్థానిక కళాకారులతో పాటు పక్క రాష్ట్రాల కళాకారుల ప్రావీణ్యానికి ఆహూతులు మైమరచిపోయి కరతాళధ్వనులు చేశారు. తొలుత వైష్ణవి సాయినాథ్ తన అసమాన చాతుర్యంతో కూచిపూడి నృత్యాంశాన్ని ‘శివతాండవం’గా అందించి వీక్షకుల్ని అబ్బురపరిచారు. సౌమ్య బృందం ఏకదంత మహాకాయ నృత్యాన్ని నేత్రపర్వంగా ప్రదర్శించారు. తర్వాత అమరావతి రాజధానిని స్ఫురింజేస్తూ చేసిన నృత్యం సాగింది. ఇక 30 మంది కర్ణాటక రాకీ ఫ్యూజన్ బ్యాండ్ బృంద సభ్యులు ప్రదర్శించిన అంశం మన్ననలు అందుకుంది. కార్తీక్ టీం బ్యాండ్‌కు అనుగుణంగా కదం కదుపుతూ చేసిన నృత్యాలు మైమరిపించాయి. అంజలి అంజలి, ఆకాశం ఏనాటిదో వంటి నృత్యాలు ఉరకలెత్తించాయి. ఈటివి ధారావాహిక ప్రసారం పాడుతా తీయగా బృందంలో మనో, శ్రావణభార్గవి, చందు, గోపికా పూర్ణిమ తదితరులు హాజరై నాటి నేటి గీతాలతో అదరహో అనిపించారు. బుల్లితెర, వెండితెర కళాకారులంతా క్రేజ్ సంపాదించుకున్న బజర్దస్త్ బృంద సభ్యులు కార్తీక్, ఆనంద్, రమేష్ నవ్వులు పూయించారు.
ఘాజీ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసిన సినీ నటుడు రానా
ఫిబ్రవరి 17న విడుదల కానున్న తెలుగు, హిందీ ఘాజీ చిత్రం ట్రైలర్‌ను నటుడు రానా విడుదల చేసి ఆహూతుల్ని అలరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పీలా గోవింద్ సత్యనారాయణ, బండారు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు.
కలెక్టర్ ఈలపాట
కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఉత్సవ్‌లో తన కళా ప్రతిభను చాటుకున్నారు. సెంటర్ ఫర్ అట్రాక్షన్ అయి కనువిందు చేశారు. ప్రముఖ వేణుగాన విద్వాంసుడు నవీన్‌కుమార్‌తో కలసి తెలుగు, హిందీ చిత్రగీతాల్లోని పలు పాటల్ని జుగల్‌బందీ ద్వారా ఆలపించారు. రోజా చిత్రంలోని ‘చిన్నిచిన్ని ఆశ, బొంబాయి చిత్రంలోని హమ్మ హమ్మ పాటతో పాటు మైనే ప్యార్ కియా చిత్రంలోని మధుర గీతాల్ని ఆలపించి ఆకట్టుకున్నారు. అనంతరం కలెక్టర్‌ను మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలు, డి ఆర్ ఎం చంద్రలేఖ ముఖర్జీ దుశ్శాలువతో సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 1994లో ఈలపాట కచేరీ చేశానని తెలిపారు. అనంతరం 22 ఏళ్ల తర్వాత తాను తిరిగి రంగప్రవేశం చేయడం ఆనందం కలిగించిందని తెలిపారు. ఇక నోవాటెల్ వద్ద రెండవ వేదికపై డప్పు, పులివేషాలు, థింసా నృత్యాలు అలరించాయి.