విశాఖ

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గిరిజనులు బెంబేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డుంబ్రిగుడ, ఏప్రిల్ 10: ఏజెన్సీలో ప్రస్తుత వేసవిలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్నానికి రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేని ప్రజలు ఇంట్లో నుంచి రావడానికి భయపడుతున్నారు. మార్చి నెల నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉంది. గత సంవత్సరం సంభవించిన హుదూద్ తుపాను మూలంగా ఈ ప్రాంతంలో చెట్లన్నీ నేలమట్టమవడంతో ఉష్ణోగ్రత ప్రభావం స్పష్టంగా తెలుస్తుంది. అత్యవసర పనులుంటే గాని ప్రజలెవరూ రోడ్లపైకి రావడానికి సాహసించడం లేదు. రానున్న కాలంలో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తుండడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. కాగా భవిష్యత్తులో అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పలువురు చెబుతున్నారు.