విశాఖపట్నం

‘ఉత్సవ’ రాద్ధాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: జిల్లా మంత్రులిద్దరూ ఉత్తర ధృవం..దక్షిణ ధృవం అని అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిస్తే వీరిమధ్య అన్యోన్యత చూసి కళ్లుకుట్టనివారంటూ ఉండరు. అదే వీరు విడి విడిగా ఉంటే, వీరంత భద్ర శత్రువులు ఇంకెవ్వరూ లేరనిపినుంచుకుంటారు. మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం విశాఖ ఉత్సవ్ సాక్షిగా మరోసారి బహిర్గతమైంది. స్థానిక కళాకారులకు విశాఖ ఉత్సవ్‌లో అవకాశం ఇవ్వలేదని మంత్రి అయ్యన్నపాత్రుడు మొదటి నుంచి నిరసన వ్యక్తం చేయడమే కాకుండా అలిగి, ఉత్సవానికి దూరంగా ఉండిపోయారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, అయ్యన్న వ్యాఖ్యలపై ఆచి తూచి మాట్లాడారు. అందరికీ అవకాశం కల్పిస్తున్నామని, మరి మంత్రి ఎందుకు ఉత్సవానికి హాజరు కాలేదో తెలియలేదంటూ గంటా మీడియా ముందు చెప్పారు. అయ్యన్న అంతటితో ఆగకుండా కేవలం పాటల పోటీలకు, డ్యాన్స్‌లకు కోట్ల రూపాయలు ఖర్చు చేయాలా? పాడి పశువుల పాల పోటీలకు కనీస నీధులు విడుదల చేయాలన్న ధ్యాస అధికారులకు లేకుండా పోయిందంటూ విరుచుకుపడ్డారు. మంత్రి గంటా వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా విశాఖ ఉత్సవాన్ని ఒంటి చేత్తో నడిపించి అయిందనిపించారు. ఒక జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే, వారి మధ్య పొరపపొచ్చాలు కచ్చితంగా తలెత్తుతుంటాయి. కొన్ని సందర్భాల్లో వారే సర్దుకుపోతారు. కాదు., కూడదంటే అధిష్ఠానం జోక్యం చేసుకుంటుని వారిస్తే, కలిసి పనిచేసుకుంటారు. లేకపోతే, ఎవరి పని వారు చేసుకుంటారు. కానీ ఈ జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పార్టీలో సీనియర్ అయిన అయ్యన్న జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాల్లోని పొరపాట్లను ఎత్తిచూపుతూ వస్తున్నారు. ఆయన వైఖరి కొంతమంది ఇష్టపడడం లేదు. ముక్కు సూటిగా మాట్లాడే అయ్యన్న ఈవిధంగా కొంతమందికి దూరమైపోయారు. కానీ ఆయన వైఖరి నచ్చిన ఎమ్మెల్యేలు ఆయన వెంటనే ఉన్నారు.
ఇదే సమయంలో గంటా శ్రీనివాసరావు తను అనుకున్నది చేసేయాలన్న ఉద్దేశంతో, తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుండా ముందుకు వెళుతున్నారు. అయ్యన్న వ్యాఖ్యలను ఆయన తేలిగ్గానే తీసుకున్నారు తప్ప, ఏనాడూ ఆయన సీరియస్‌గా తీసుకోలేదు. గంటా తీసుకున్న నిర్ణయాన్ని అయ్యన్నతో చర్చిస్తున్నారో, లేదో తెలియదు. కానీ జిల్లాలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే విమర్శలు, ప్రతి విమర్శలకు అవకాశం ఉండదు. అలా జరగకపోవడం వలన ఉత్సవ వేళ ప్రజల్లో మంత్రులు, తద్వారా ప్రభుత్వం చులకనయ్యే ప్రమాదం ఉందన్న విషయాన్ని గ్రహించాలి.