విశాఖ

ఆసుపత్రిలో సదుపాయాల మెరుగుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కపల్లి, ఫిబ్రవరి 5: రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాల మెరుగునకు కృషిచేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. పాయకరావుమండలంలోని మంగవరం పంచాయతీలో 70లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనితతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందన్నారు. అదే విధంగా శిశు మరణాలను తగ్గించేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రిలో ఎక్కడెక్కడ సదుపాయాలున్నాయి, ఏయే రకమైన సదుపాయాలున్నాయి. బడుగు, బలహీనులకు ఏ రకంగా ఆసుపత్రి లో సదుపాయాలు అందుతున్నాయనే దానిపై ఆన్‌లైన్ ద్వారా పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుని తద్వారా సదుపాయాల కల్పనకు కృషిచేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందన్నారు. తాగునీరు కల్పనతోపాటు రైతులకు సాగునీరు, అలాగే బడుగు బలహీనవర్గాల వారికి ఆసుపత్రిలో సదుపాయాల కోసం, ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి తమవంతు కృషిచేస్తున్నట్లు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో పాయకరావుపేట, నక్కపల్లి, రాయరవరం, కోటవురట్ల మండల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు, కె. వెంకటేష్, వినోద్‌రాజు, లాలం కాశీనాయుడు, మంగవరం సర్పంచ్ దేవవరపు ఆనందకుమార్ పాల్గొన్నారు.